ఇకపై AC, కూలర్‌ వాడితే విద్యుత్ బిల్లు ఆదా..!

TV9 Telugu

20 May 2024

వేసవిలో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో విద్యుత్ బిల్లు కూడా భారీగా పెరుగుతుంది.

ఇక్కడ మేము మీకు ఒక పద్ధతిని చెప్పబోతున్నాం.. దాని ద్వారా ఏసీ, కూలర్ ఉన్న మీ విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.

సోలార్ పవర్ అనేక ఓ కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

ఈ పథకంలో, 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ప్రజల ఇళ్లపై ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తోంది.

1 టన్ను ACని 3kw సోలార్ పవర్‌తో నడపవచ్చు. అంటే ఇంట్లో వాడుతున్న ఏసీ, కూలర్ విద్యుత్ లేకుండా నడపవచ్చు.

భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పైకప్పుతో కూడిన ఇల్లు కలిగి ఉండవలసి ఉంటుంది.

మీరు అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.inని సందర్శించడం ద్వారా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం.