Pakistan: భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్ పిల్లలు మురికి కాల్వల్లో పడి చనిపోతున్నారు.
భారత్ వంటి దేశాలు చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంటే పాకిస్థాన్‌లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్ట సభ్యుడు, పాకిస్థాన్ ఎంక్యూఎం-పీ పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తోంది కానీ కరాచీ పరిస్థితి ఏంటంటే.. చాలామంది పిల్లలు తెరిచివున్న మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారనీ అన్నారు.
భారత్ వంటి దేశాలు చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంటే పాకిస్థాన్‌లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్ చట్ట సభ్యుడు, పాకిస్థాన్ ఎంక్యూఎం-పీ పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తోంది కానీ కరాచీ పరిస్థితి ఏంటంటే.. చాలామంది పిల్లలు తెరిచివున్న మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారనీ అన్నారు. ఇండియా చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు వస్తున్నాయనీ ఆ వెంటనే కరాచీలో ఓ పిల్లాడు నాలాలో పడి మరణించినట్టు వార్తలు వస్తున్నాయనీ ప్రతీ మూడో రోజూ ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌కు కరాచీ ‘రెవెన్యూ ఇంజిన్’ లాంటిదని, దేశంలో రెండు ఓడరేవులు ఉన్నాయని పేర్కొన్న కమల్.. పాకిస్థాన్, సెంట్రల్ ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌కు కరాచీ గేట్‌వే లాంటిదని తెలిపారు. ఇక్కడి నుంచి దాదాపు 68 శాతం ఆదాయాన్ని దేశం మొత్తానికి ఇస్తున్నట్టు వివరించారు. కానీ, 15 ఏళ్లుగా కరాచీకి పరిశుభ్రమైన నీటిని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నీరు కూడా చోరీకి గురవుతోందని, ట్యాంకర్ మాఫియా దానిని దోచుకుని కరాచీ ప్రజలకు అమ్ముతోందని అన్నారు. పాకిస్థాన్‌లో 26.6 మిలియన్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 70 దేశాల్లోని జనాభా కంటే ఎక్కువని వాపోయారు. చదువుకోని పిల్లలు దేశ ఆర్థికాభివృద్ధి మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కమల్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.