Credit Cards: మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, వినియోగదారులు..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 20,000 రూపాయల వరకు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే ఒక శాతం ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు 1500 రూపాయలు చెల్లిస్తుంటే అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ మార్పులు తీసుకొస్తోంది. తాజాగా క్రెడిట్ కార్డుల విషయంలో పలు కొత్త రూల్స్ ను ఎస్బీఐ తీసుకొచ్చింది. AURUM, ఎస్బీఐ కార్టు ఎలైట్, ఎస్బీఐ కార్టు ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్టు పల్స్, సింప్లి క్లిక్ ఎస్బీఐ కార్డులలో రివార్డు పాయింట్లు నిలిపివేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.