Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్.. మైక్‌ పెట్టి మరీ అనౌన్స్‌మెంట్!

బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్‌రెడ్డి షాపింగ్ మాల్‌కు నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయిల చెల్లింపుపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు అర్టీసీ అధికారులు.

Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్.. మైక్‌ పెట్టి మరీ అనౌన్స్‌మెంట్!
Rtc Shopping Mall
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 09, 2024 | 11:12 PM

బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్‌రెడ్డి షాపింగ్ మాల్‌కు నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయిల చెల్లింపుపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు అర్టీసీ అధికారులు. అంతేకాదు.. అద్దె చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్ చేయనున్నట్లు, మాల్‌ మొత్తం తిరుగుతూ మైక్‌తో అనౌన్స్‌మెంట్ చేశారు. షాపింగ్ మాల్‌లో ఉన్న అద్దె దుకాణదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ లీజ్‌ స్థలంలో మాల్‌ను నిర్మించిన విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. కనీసం రూ. 3.41 కోట్ల బకాయి అయినా చెల్లించాలంటూ లాస్ట్‌ డే డెడ్‌లైన్ విధించారు. గడువులోగా బకాయి చెల్లించకుంటే ఏ క్షణమైనా జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్ చేసే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ అధికారలు.

వాస్తవానికి.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ శాఖలపై సమీక్షలు చేసింది. ఆయా శాఖల్లోని బకాయిల లిస్టుల దుమ్ము దులిపారు. ఈ క్రమంలోనే.. ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ బకాయిల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆర్టీసీ లీజ్‌ బకాయి 7.23 కోట్లతోపాటు.. విద్యుత్‌ బకాయిలు 2.5 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇవ్వడం.. కరెంట్ సరఫరా నిలిపివేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వాయిదాలు కోరుతుండడంతో గడువు ఇస్తూ వస్తున్నామని.. మరింత నిర్లక్ష్యం వహించడంతో మాల్‌ సీజ్‌కు నిర్ణయించినట్లు అనౌన్స్‌ చేశారు ఆర్టీసీ అధికారులు. ఇక.. మాల్‌ సీజ్‌ అనౌన్స్‌ వ్యవహారంపై జీవన్‌రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..