AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మొదటిసారి లాభాల బాటలో బ్యాంకింగ్ రంగం.. పేదలు, రైతులు, MSMEలకు మేలు చేస్తుందన్న ప్రధాని మోదీ.. 

బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పరుగులు తీస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా బ్యాంకింగ్ రంగ నికర లాభం రూ.3 లక్షల కోట్లు దాటింది. లిస్టెడ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం ఆర్ధిక సంవంత్సరం-2023లో రూ.2.2 లక్షల కోట్ల నుంచి .. 39% పెరిగి రూ.3.1 లక్షల కోట్లకు చేరుకుంది.

PM Modi: మొదటిసారి లాభాల బాటలో బ్యాంకింగ్ రంగం.. పేదలు, రైతులు, MSMEలకు మేలు చేస్తుందన్న ప్రధాని మోదీ.. 
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2024 | 3:02 PM

Share

బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పరుగులు తీస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా బ్యాంకింగ్ రంగ నికర లాభం రూ.3 లక్షల కోట్లు దాటింది. లిస్టెడ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం ఆర్ధిక సంవంత్సరం-2023లో రూ.2.2 లక్షల కోట్ల నుంచి .. 39% పెరిగి రూ.3.1 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.. గతేడాది (2023) తో పోలిస్తే 34% పెరుగుదల నమోదైంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ. 1.2 లక్షలతో పోలిస్తే తమ నికరలాభం 42% పెరిగి దాదాపు రూ. 1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం నాటి నుంచి బ్యాంకింగ్ రంగంలోని ప్రభుత్వం-ప్రైవేటు రెండు రంగాల మధ్య ఆదాయం భారీ పెరిగింది.

కాగా.. బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పయనించడం పట్ల ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశ బ్యాంకింగ్ రంగం నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ రంగం కుదేలయిందని పేర్కొన్నారు. ‘‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపులో ఇదొకటి.. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు, UPA ఫోన్-బ్యాంకింగ్ విధానం కారణంగా మన బ్యాంకులు నష్టాలు, అధిక NPAలతో కొట్టుమిట్టాడాయి. పేదలకు బ్యాంకుల తలుపులు మూసివేశారు.. బ్యాంకింగ్ రంగంలో ఈ మెరుగుదల మన పేదలు, రైతులు, MSMEలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.’’ అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్..

వాస్తవానికి రూ. 3 లక్షల కోట్లు అనేది ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం త్రైమాసిక లాభాలు.. నిజానికి, బ్యాంకుల లాభాలు ఇటీవలి సంవత్సరాలలో అత్యంత లాభదాయకమైన గ్రూప్‌గా ఉన్న IT సేవల కంటే చాలా ఎక్కువ.. లిస్టెడ్ IT సేవల కంపెనీలు FY24కి దాదాపు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. గత సంవత్సరాల్లో, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌లను క్లీన్ చేయడం.. ఆదాయాలను పెంచుకోవడంతో ప్రైవేట్ బ్యాంకులతో తమ లాభ అంతరాన్ని తగ్గించాయి. వాస్తవానికి గత మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం నాలుగు రెట్లు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..