కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,335 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 05, 2020 | 9:20 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,335 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. 24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,171 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,176 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,72,388 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 36,348 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 32,41,597 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 262, ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 34, జగిత్యాల్‌ 23, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్‌ 15, కామారెడ్డి 21, కరీంనగర్‌ 83, ఖమ్మం 48, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 3, మహబూబ్‌ నగర్‌ 34, మహబూబాబాద్‌ 33, మంచిర్యాల్‌ 21, మెదక్‌ 11, మేడ్చల్ మల్కాజ్‌గిరి 91, ములుగు 23, నాగర్‌ కర్నూల్‌ 28, నల్గొండ 72, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 22, నిజామాబాద్‌ 38, పెద్దంపల్లి 22, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 137, సంగారెడ్డి 69, సిద్ధిపేట్‌ 39, సూర్యాపేట 22, వికారాబాద్‌ 14, వనపర్తి  21, వరంగల్‌ రూరల్‌ 9, వరంగల్‌ అర్బన్‌ 43, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: ఆ ఆరుగురిని టెన్షన్ పెట్టి, కూల్‌ చేసిన నాగార్జున

Bigg Boss 4: ‘జంబలకిడి పంబ’ ఫన్‌.. సొహైల్‌ని చూసి విజిల్ వేసిన నాగ్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu