టీటీడీ కీల‌క నిర్ణ‌యంః వ‌ర్చువ‌ల్ విధానంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాలు..

భ‌క్తులు అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా టీటీడీ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది. క‌రోనా ప‌రిస్థితుల్లోవ‌ర్చువ‌ల్ విధానంలో వ్ర‌తాలు నిర్వ‌హించ‌నుంది....

టీటీడీ కీల‌క నిర్ణ‌యంః వ‌ర్చువ‌ల్ విధానంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాలు..
Follow us

|

Updated on: Jul 28, 2020 | 6:08 PM

గ‌త 6 నెల‌లుగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగా దేవాల‌యాల‌ను కూడా మూసివేశారు. కాగా, అన్‌లాక్ 2.0తో ఇప్పుడిప్పుడే తిరిగి ఆల‌య ద్వారాలు తెరుచుకున్నాయి. ప‌లు ఆల‌యాల్లో పరిమిత సంఖ్య‌లో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తుండ‌గా, ఇప్పుడు శ్రావ‌ణ మాసం కూడా వ‌చ్చేసింది. మ‌హిళా భ‌క్తులు అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా టీటీడీ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది. క‌రోనా ప‌రిస్థితుల్లోవ‌ర్చువ‌ల్ విధానంలో వ్ర‌తాలు నిర్వ‌హించ‌నుంది.

తిరుప‌తిలోని తినుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయంలో ఈ నెల 31న వ‌ర్చువ‌ల్ విధానంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాలు జ‌రిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్రతంలో పాల్గొనేవారు టికెట్ల‌ను కొనేందుకు వీలుగా ఆన్‌లైన్ విధానంలో గోవింద మొబైల్ యాప్‌ని అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవ‌చ్చని తెలిపింది. అలా బుక్ చేసుకున్న వారికి టీటీడీ పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పూజా సామాగ్రిని సప్లై చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

వ‌రల‌క్ష్మీ వ్ర‌తంలో కావాల్సిన‌‌ పూజా సామాగ్రి ఉత్తరీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షిత‌లు, కంక‌ణాలు అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల ద‌గ్గ‌ర ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వాటిని వరలక్ష్మీ వ్రతం టికెట్లు పొందిన భక్తులకు అంద‌జేస్తున్నారు. జులై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ వరలక్ష్మీ అమ్మవారి వ్రతం… SVBCలో లైవ్‌లో వస్తుంది. వ్రతంలో పాల్గొనే భక్తులు… అర్చకులు చెప్పినట్లుగా చేస్తూ… తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?