కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు చేరుకున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో విషవాయువు లీక్ ఘటన తెలీగానే అక్కడి కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని..

కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన జగన్
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 2:02 PM

విశాఖలో గ్యాస్‌ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. ఇప్పటికే వైజాగ్‌లో విషవాయువు లీక్ ఘటన తెలీగానే అక్కడి కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వైజాగ్ బయలు దేరారు సీఎం. కాగా ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు కూడా స్పందించారు.

కాగా అర్ధ‌రాత్రి సాగ‌ర తీరం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అంతా గాఢ‌నిద్ర‌లో ఉండ‌గా విష‌వాయువు వ్యాపించి ప్ర‌జ‌ల ఊరిపి తీసింది. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన జనం ఎక్కడికక్కడే పిట్ట‌ల్లా రాలిప‌డిపోయారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.. ఎక్కడ చూసినా రోడ్లపై అపస్మారక స్థితిలో పడిపోయిన జ‌నం, జంతువుల‌తో ఆ ప్రాంతం హృద‌య‌విదార‌కంగా క‌నిపించింది. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగాలు దిగి ప‌రిస్థితిని కంట్రోల్ చేశాయి.. గ్యాస్ లీకేజీ జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చేరుకున్న బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి.

Read More: విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు