AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ లీడర్స్‌ స్పందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్...

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై పొలిటికల్ లీడర్స్‌ దిగ్భ్రాంతి
TV9 Telugu Digital Desk
|

Updated on: May 07, 2020 | 1:06 PM

Share

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ లీడర్స్‌ స్పందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత పలువురు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. తెల్లవారు జామునే ఈ ఘటన తెలిసి షాక్‌కి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్స్‌లో పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

కాగా అర్ధ‌రాత్రి సాగ‌ర తీరం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అంతా గాఢ‌నిద్ర‌లో ఉండ‌గా విష‌వాయువు వ్యాపించి ప్ర‌జ‌ల ఊరిపి తీసింది. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన జనం ఎక్కడికక్కడే పిట్ట‌ల్లా రాలిప‌డిపోయారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా రోడ్లపై అపస్మారక స్థితిలో పడిపోయిన జ‌నం, జంతువుల‌తో ఆ ప్రాంతం హృద‌య‌విదార‌కంగా క‌నిపించింది. లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

Follow Us
అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం
అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం
మైదానంలోనే నరకం చూసిన రాహుల్.. నడవలేని స్థితిలో స్థార్ బ్యాటర్
మైదానంలోనే నరకం చూసిన రాహుల్.. నడవలేని స్థితిలో స్థార్ బ్యాటర్
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు!
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభం
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
వస్తువుల ధరలు రూ.499, రూ.799, రూ.999 అని ఎందుకు ఉంటాయి?ఆ సీక్రెట్
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే
94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో గంగులీ తర్వాత మనోడే
90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా పరార్
90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా పరార్
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..