Vizag: ఏపీ సీఎం జగన్‌తో రహేజా భేటీ.. విశాఖలో ఇన్ ఆర్బిట్ మాల్ శంకుస్థాపనకు ఆహ్వానం

| Edited By: Srilakshmi C

Jul 19, 2023 | 7:35 AM

విశాఖ న‌గ‌రంలోని ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలోని సాలిగ్రామ‌పురంలో ఉన్న పోర్ట్ హాస్పిటల్ స్థలంలో త్వరలో ఇన్ ఆర్బిట్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. వైజాగ్ పోర్ట్‌కు చెందిన నిరుపయోగంగా ఉన్న 17 ఎక‌రాల స్థలం ఇన్ ఆర్బిట్ మాల్ ఏర్పాటుకు..

Vizag: ఏపీ సీఎం జగన్‌తో రహేజా భేటీ.. విశాఖలో ఇన్ ఆర్బిట్ మాల్ శంకుస్థాపనకు ఆహ్వానం
Raheja Group To Set Up Inorbit Mall In Vizag
Follow us on

విశాఖపట్నం, జులై 19: విశాఖ న‌గ‌రంలోని ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలోని సాలిగ్రామ‌పురంలో ఉన్న పోర్ట్ హాస్పిటల్ స్థలంలో త్వరలో ఇన్ ఆర్బిట్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. వైజాగ్ పోర్ట్‌కు చెందిన నిరుపయోగంగా ఉన్న 17 ఎక‌రాల స్థలం ఇన్ ఆర్బిట్ మాల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంద‌ని గుర్తించిన రహెజా గ్రూప్ ఈ మేరకు కొద్ది నెలలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. అదే సమయంలో తమ వద్ద నిరుపయోగంగా ఉన్న స్థలాలను లీజ్‌కు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న పోర్ట్ యాజమాన్యం రహేజ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. 17 ఎకరాల స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు ఇచ్చింది. ఇందుకు గాను పోర్ట్ నిర్దేశించిన 125 కోట్ల రూపాయలను ర‌హేజా గ్రూప్ చెల్లించింది. మిగతా డాక్యుమెంటేషన్ వర్క్ కూడా పూర్తి కావడంతో భూమి పూజకు సిద్దం అవుతోంది రహెజా గ్రూప్.

భారతదేశంలోని ప్రసిద్ధ నగరాల్లో షాపింగ్ మాల్‌లను నిర్వహిస్తోన్న కె రహేజా కార్పొరేషన్‌ విశాఖలో కూడా ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనుంది. దేశంలోనే ఏడవ ఇన్ ఆర్బిట్ మాల్ విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. మొదటిది 2004లో ముంబైలోని మలాడ్‌లో ప్రారంభించబడింది. రెండవది నవీ ముంబై లోని వాషి లో 2008లో, 2009లో హైదరాబాద్‌లో మూడవది, పూణేలోని వడ్గావ్ షెరీలో 2011 లో నాల్గవది, 2012లో బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఐదవది, 2013 లో వడోదరలో ఆరవది కాగా పడి సంవత్సరాల గ్యాప్ తర్వాత 2023 లో విశాఖ లో ఏడవ మాల్ కు శంకుస్థాపన చేయనుంది కే రహేజా కార్పొరేషన్.

Whatsapp Image 2023 07 18 At 23.14.52

కే రహేజా కార్పొరేషన్ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తో మంగళవారం సమావేశమై విశాఖ లో నిర్మించనున్న ఇన్ ఆర్బిట్ మాల్ ప్రణాళిక పై చర్చించారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రహేజా గ్రూప్ ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం చేపట్టానున్నట్లు నీల్ రహేజా వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన ఈ భేటీలో రహేజా గ్రూప్. విశాఖ లో ప్రస్తుతం చేపట్టనున్న ఇనార్బిట్‌ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు సీఎం జగన్ ను రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అతిపెద్ద నగరం గా, కాస్మొపాలిటిన్ సిటీ గా పేరు గాంచిన విశాఖ కు ఇన్ ఆర్బిట్ మాల్ రాకతో మరింత శోభ చేకూరనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.