Andhra Pradesh: ఒక్కటి దొరికినా జీవితం మారిపోతుందని కొండంత ఆశ..! వజ్రాల కోసం అక్కడ అన్వేషణ..
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే కోహినూర్ వజ్రం దొరికిందని స్థానికంగా ప్రచారముంది . కృష్ణా నది తీరంలో ఉండే ఈ గ్రామం ప్రస్తుతం పులిచింతల బ్యాక్ వాటర్ లో మునిగి పోయింది. గతంలో ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాగేది. తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్ళూరు వెళ్ళి కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారు.

కోహినూర్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై ఒక కథ కూడా స్ధానికంగా ప్రచారంలో ఉండేది. బెల్లంకొండ ప్రాంతాన్ని పాలించే రాజు వద్దకు అతి పెద్దదైన వజ్రాన్ని స్థానికులు తీసుకొచ్చారని దాన్ని స్థానికంగా ఉన్న రాజు ముస్లిం రాజు వద్దకు తీసుకెళ్ళగా దాన్ని చూసిన ముస్లిం రాజు ఆశ్చర్యంతో కోయి నహీ నూర్ అన్నాడని తర్వాత కాలంలో అదే కోహినూర్ అయిందని చెప్పుకునేవారు. అలా ముస్లిం రాజుల వద్దకు చేరిన కోహినూర్ బ్రిటీష్ పాలకులు సమయంలో చేరిందని చెప్పుకుంటుంటారు. ఈ నేపధ్యంలోనే కోళ్ళూరు పులి చింతల బ్యాక్ వాటర్ లో మునిగి పోయేంత వరకూ వజ్రాల వేట కొనసాగేది.
అయితే ప్రస్తుతం బెల్లంకొండ సమీపంలోని క్వారీల నుండి కొండమట్టిని సత్తెనపల్లిలోని బసవమ్మ వాగు పక్కన ఏర్పాటు చేస్తున్న ప్లాట్స్ లో పోశారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వర్షం పడిన వెంటనే స్థానికులు ఆ మట్టిలో వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకంతో వెదుకులాట మొదలు పెట్టారు. రెండు రోజుల నుండీ ఇక్కడ వజ్రాల వేట సాగుతుంది. వజ్రాలు కాకపోయినా రంగు రాళ్ళైన దొరుకుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం మీద బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
టి నాగరాజు, స్పెషల్ కరస్పాండెంట్, టివి9, గుంటూరు