Andhra Pradesh: చెయ్యి చెయ్యి కలిపారు.. నదిపై సొంతంగా వంతెన వేశారు
గ్రామస్థులే నడుం బిగించి శ్రమదానం పేరుతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. మీకేమి చేతకాదు అని వెక్కిరించినవారే ఇప్పుడు ఆ గ్రామస్తుల సక్సెస్ చూసి పొగుడుతున్నారు. ఆ గ్రామస్తులు సాధించిన ఆ విజయం ఏంటి? ఎక్కడ ఆ గ్రామం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని బోరి, బండిగూడ అనే గిరిజన గ్రామాల విజయగాథ అది.

గ్రామస్థులే నడుం బిగించి శ్రమదానం పేరుతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. మీకేమి చేతకాదు అని వెక్కిరించినవారే ఇప్పుడు ఆ గ్రామస్తుల సక్సెస్ చూసి పొగుడుతున్నారు. ఆ గ్రామస్తులు సాధించిన ఆ విజయం ఏంటి? ఎక్కడ ఆ గ్రామం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని బోరి, బండిగూడ అనే గిరిజన గ్రామాల విజయగాథ అది. ఆ గిరిజన గ్రామాలకు వెళ్ళాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. ఉదయం ఊరు నుండి వెళ్లిన మనిషి సాయంత్రం క్షేమంగా ఇంటికి వచ్చాడంటే హమ్మయ్య ఈ రోజు సంతోషంగా గడిచిపోయింది అని ఆనందం పడేవారు. అందుకు ప్రధాన కారణం ఊరు నుండి బయటకు వెళ్లి తిరిగి రావాలంటే ప్రమాదకరమైన నీరు ప్రవహించే గెడ్డ దాటి వెళ్లి రావటమే కారణం. వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. బోరి, బండిగూడతో పాటు సమీప గ్రామాలైన బల్లేరు, బోరుగూడ, కిడికేసు, బల్లేరుగూడ, నిడగల్లుగూడ గిరిజనులు ఎటువంటి అవసరాలు ఏర్పడిన గెడ్డ దాటాల్సిందే.
బోరి, బండి గూడ గ్రామస్తులు నిత్యావసర సరుకుల కోసం గెడ్డ దాటి అవతల వైపు ఉన్న గొటివాడ, కురుపాం వెళ్లాలి. అందుకోసం గెడ్డలో దిగి నడుముల్లోతు వరకు ఉన్న నీటిలో నుండి నడుచుకొని వెళ్ళాలి. అనారోగ్యం తో ఉన్నవారికి డోలీలే గతవుతాయి.. ఈ గెడ్డ దాటుతూ గతంలో కొంతమంది మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ గ్రామాలకు రాకపోకల కోసం గెడ్డ పై వంతెన ఏర్పాటు చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే పలు పర్యావరణ అడ్డంకులతో శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణం సాధ్యం కాలేదు. అందుకోసం ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. వంతెన నిర్మాణ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఏదోలా తమ వంతు తాత్కాలిక రోడ్డు మార్గం నిర్మించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అందుకోసం గ్రామసభ పెట్టుకొని అందరి నిర్ణయం మేరకు బండిగూడ గ్రామస్తులు, యువత స్వచ్ఛందంగా కర్రలతో ఒక వంతెనను కట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

అందుకోసం కావాల్సిన కర్రలు, చెట్టుమానులు, త్రాళ్లతో పాటు ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నారు. అన్నింటి సహాయంతో గ్రామస్తులు అంతా నాలుగు రోజుల పాటు శ్రమించి చాలా జాగ్రత్తలు తీసుకొని గెడ్డకు ఇరు వైపుల కర్రలు పాతి రెండింటికీ మధ్య మరికొన్ని కర్రలతో వంతెన నిర్మించారు. కర్రలు సేకరణ తో పాటు వంతెన నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలను భరించారు. ఎట్టకేలకు విజయవంతంగా వంతెన నిర్మాణం పూర్తి చేసుకున్నారు. దీంతో గ్రామస్థులకు తాత్కాలికంగా కష్టాలు తీరాయి. కర్రల వంతెన నిర్మాణంతో స్కూల్ కి వెళ్ళే చిన్నారులతో పాటు గ్రామస్తుల రాకపోకలకు కొంతమేర కష్టాలు తప్పాయి.. ఇప్పుడు ఆ గ్రామస్థులకు గతంలో వలె నడుముల్లోతు నీటిలో ప్రయాణించే కష్టం తప్పింది. ఆ గ్రామస్తులు ఆలోచన, అమలు చేసిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




