Andhra Pradesh: చేతిలో గోల్డ్ బ్యాగ్.. గన్నుతో వచ్చిన ఇద్దరు యువకులు.. ఇంతలో ఏం జరిగిందంటే..?
బాపట్ల పట్టణం.. జమ్ములపాలెం ఆర్వోబి సెంటర్.. జనంతో రోడ్లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి.. ఈ సమయంలో ఒక వ్యక్తి అక్కడున్న వారితో మాట్లాడుతున్నాడు. ఇంతలో సర్రుమంటూ ఒక బైక్ దూసుకొచ్చింది. ముఖానికి మాస్క్ లు ధరించిన ఇద్దరు యువకులు బైక్ ను ఆ వ్యక్తి వద్దే ఆపారు. అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొనే ప్రయత్నం చేశారు.

బాపట్ల, అక్టోబర్ 07: బాపట్ల పట్టణం.. జమ్ములపాలెం ఆర్వోబి సెంటర్.. జనంతో రోడ్లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి.. ఈ సమయంలో ఒక వ్యక్తి అక్కడున్న వారితో మాట్లాడుతున్నాడు. ఇంతలో సర్రుమంటూ ఒక బైక్ దూసుకొచ్చింది. ముఖానికి మాస్క్ లు ధరించిన ఇద్దరు యువకులు బైక్ ను ఆ వ్యక్తి వద్దే ఆపారు. అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొనే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా గట్టిగానే ప్రతిఘటించాడు. దీంతో గన్ బయటకు తీసి అతనిపై కొట్టారు. అయినప్పటికీ అతను బ్యాగ్ వదల్లేదు. ఇదే సమయంలో స్థానికులు గుమికూడుతుండటంతో ఆ ఇద్దరు యువకులు బైక్ పైపారిపోయారు. అసలేం జరిగిందంటే..
గుంటూరుకు చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి ప్రకాష్.. గుంటూరు నుంచి బాపట్ల వచ్చి వ్యాపారుల వద్ద నుంచి ఆభరణాల తయారీకి ఆర్డర్లు తీసుకుంటాడు. తర్వాత ఆభరణాలను వ్యాపారులకు ఇచ్చి కమీషన్ తీసుకుంటాడు. ప్రకాష్ ఎప్పటి లాగే రెండు రోజుల క్రితం బాపట్ల వచ్చాడు. వ్యాపారస్తులను కలిసి ఆర్డర్లు తీసుకున్నాడు. ఆ తర్వాత పెదనందిపాడు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్దకు వచ్చాడు. అక్కడ కొంతమంది తెలిసిన వాళ్లుంటే వాళ్లతో మాట్లాడుతున్నాడు.
అదే సమయంలో మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ప్రకాష్ ఎదురుగా బైక్ నిలిపారు. వెంటనే అతని చేతిలో ఉన్న నగల సంచిని లాక్కొనే ప్రయత్నం చేశారు. అయితే, ప్రకాష్ గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో వెంటనే ఆ యువకులు గన్ బయటకు తీసి అతని చేతిపై గన్‌తో కొట్టారు. అయినప్పటికీ ప్రకాష్ బ్యాగ్ వదల్లేదు. ఇది చూసి సమీపంలోని వ్యాపారులు పారిపోయారు. అయితే, ప్రకాష్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు గుమికూడే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకులు అక్కడి నుంచి వచ్చిన బైక్ పైనే పారిపోయారు.
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆ యువకులు ఆనవాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దుండగుల దాడిలో గాయపడిన ప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే గన్ తీసి బెదిరించడం కలకలం రేపింది. అయితే, అది అసలు గన్ కాదు డమ్మీగన్ అని పోలీసులు భావిస్తు్న్నారు. సిసి కెమెరా విజువల్స్ సాయంతో యువకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
