AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు.. వారికి పండగే పండగ..

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా త్వరలో విశాఖ మారనుంది. ఆ వ్యవహారం ఇంకా న్యాయ వివాదాల్లో ఉండగా ముందస్తు సూచికగా ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ కు మార్చడానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ నెల 24 దసరా కు విశాఖ కు ముఖ్యమంత్రి కార్యాలయం మార్పుకు అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వస్తే విశాఖ నగర రూపు రేఖలు మారనున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కోసం విశాఖ కు వచ్చే అతిథులు,

Andhra Pradesh: విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు.. వారికి పండగే పండగ..
Andhra Pradesh Cm Camp Office Transfer To Visakhapatnam
Eswar Chennupalli
| Edited By: Shiva Prajapati|

Updated on: Oct 08, 2023 | 7:29 AM

Share

Andhra Pradesh: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా త్వరలో విశాఖ మారనుంది. ఆ వ్యవహారం ఇంకా న్యాయ వివాదాల్లో ఉండగా ముందస్తు సూచికగా ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ కు మార్చడానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ నెల 24 దసరా కు విశాఖ కు ముఖ్యమంత్రి కార్యాలయం మార్పుకు అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వస్తే విశాఖ నగర రూపు రేఖలు మారనున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కోసం విశాఖ కు వచ్చే అతిథులు, అధికారుల తో విమానాలు, హోటళ్ళు కు బాగా గిరాకీ పెరగనుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖ కు వస్తే విశాఖ విమానాశ్రయానికి కూడా తాకిడి పెరగనుంది. ముఖ్యమంత్రి విశాఖ వస్తే అధికారిక సమీక్షలు ఇక్కడే జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు, వీఐపి, వి వీ ఐ పీ లు నగరానికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంటుంది. దీంతో నగరం నుండి ఇతర మెట్రో నగరాలకు విమాన సేవలను పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా నడుస్తున్న విమాన సర్వీసులు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై మరియు కోల్‌కతాకు వెళ్లే వాటితో సహా విజయవాడ వెళ్ళే విమాన సర్వీసులలో 80 నుండి 90 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు మరిన్ని విమాన సర్వీసులు అవసరం కానున్నాయి.

ప్రస్తుతం విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం 35 నుంచి 40 విమానాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా నుంచి నగరానికి మారనున్న నేపథ్యంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రభుత్వ పెద్దల రాకపోకలు రెట్టింపు కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు విమాన సర్వీసులను పెంచాలని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నం ఎంపీ, కమిటీ చైర్మన్‌ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఏఏసీ ప్రతినిధులు ఓ నరేష్‌ కుమార్‌, డీఎస్‌ వర్మ, కే నరసింగరావు, జీ శ్రీనుబాబులతో పాటు ఇటీవల రాజారెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ ఏఎస్‌క్యూ క్యూ2 ర్యాంకింగ్‌ను ప్రస్తుత 66 నుంచి టాప్ 30కి పెంచాలని డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీని కోసం ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించాల్సిన అవసరాన్ని డైరెక్టర్ కు కమిటీ నొక్కిచెప్పింది.

ఇవి కూడా చదవండి

90 శాతం ఆక్కుపెన్సీ ఉన్న రూట్లలో సర్వీసుల పెంపు పై విజ్ఞప్తులు..

ప్రస్తుతం పలు రూట్ల విమాన సర్వీసులలో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. అలాంటి గమ్యస్థానాలకు మరిన్ని విమాన సర్వీసులను నడిపే అవకాశాలను పరిశీలించాలని కమిటీ పలు విమానయాన సంస్థలను కమిటీ అభ్యర్థించింది. అంతేకాకుండా, ప్రయాణికులలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వారణాసి, దుబాయ్ మరియు మలేషియాలకు విమానాలను ప్రవేశపెట్టడానికి మంత్రిత్వ శాఖకు లేఖ పంపాలని విమానాశ్రయ డైరెక్టర్‌కు కమిటీ సూచించింది.

ఇప్పటికే విమానాశ్రయానికి పెరిగిన ప్రయాణికుల రద్దీ..

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల కాలంలో ప్రయాణికుల తాకిడి ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 16 లక్షల మంది దేశీయ, అంతర్జాతీయ రాకపోకలు సాగించారు. గత సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల్లో 12.5 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. డొమెస్టిక్ విమానాల రాకపోకలు కూడా ఏడాదికి 7,045 నుంచి 7,184కి పెరిగాయి. అయితే రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 170 నుంచి 164కి స్వల్పంగా తగ్గాయి. కానీ ఈ నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. కొన్ని నెలల నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటోంది. ఇప్పుడది నెలకు 2.6 లక్షలకు పెరిగింది. కాగా ఈ ఎయిర్‌పోర్టు ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికులు రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నా త్వరలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ప్రయాణికుల రాకపోకలు సాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..