Visakhapatnam: జలపుష్పాల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూస్తే స్టన్..

సముద్రంలో జల పుష్పాల కోసం మత్స్యకారులు వేట కొనసాగిస్తుంటారు. నిత్యం కొనసాగే ఈ వేటలో వారి వలకు చిన్న చేపల నుంచి పెద్ద చేపలు వరకు ఏదో ఒకటి చిక్కుతూనే ఉంటాయి.

Visakhapatnam: జలపుష్పాల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూస్తే స్టన్..
Fishing (Representative image)

Updated on: Nov 30, 2022 | 2:49 PM

సముద్రంలో జల పుష్పాల కోసం మత్స్యకారులు వేట కొనసాగిస్తుంటారు. నిత్యం కొనసాగే ఈ వేటలో వారి వలకు చిన్న చేపల నుంచి పెద్ద చేపలు వరకు ఏదో ఒకటి చిక్కుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మత్స్యకారుల వేటలో అదృష్టం, దురదృష్టం రెండూ ఎదురొస్తుంటాయి. తాజాగా.. జీవనోపాధి కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుడికి భయంకరమైన పాము వలకు చిక్కింది.. ఒక్క కాటుకే ప్రాణాలను బలిగొనే సముద్ర సర్ఫాన్ని చూసి మత్స్యకారుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం సాగర తీరంలో చోటుచేసుకుంది. విశాఖ సాగర తీరంలో బుధవారం సముద్ర పాము కలకలం రేపింది. సాగర్ నగర్ బీచ్ సమీపంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలకు అయిదు అడుగుల ప్రమాదకరమైన పాము చిక్కింది.

ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినప్పటికీ.. విషపూరితమైన ఈ సర్ఫం చిక్కడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. సముద్ర పాముగా పిలిచే ఈ సర్పం శాస్త్రీయ నామం.. హైడ్రోఫీయిస్ గ్రాసిలిస్.. సముద్ర జలాల్లో అత్యంత వేగంగా సంచరించే జీవుల్లో ఈ సర్పం ఒకటి. చిన్నచిన్న చేపలను తింటూ సముద్ర గర్భంలో సంచరించే ఈ పాము ప్రమాదకరమైనదని మత్స్యకారులు పేర్కొంటున్నారు.

Snake

ఈ పాము కాటేస్తే సకాలంలో వైద్యం చేయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు తెలిపారు. ఆహార అన్వేషణలో సముద్రంలో సంచరిస్తున్న ఈ పాము, అకస్మాత్తుగా వలకు చిక్కిపోయింది. వలలో పడిన పామును మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ పామును చూసి స్థానికులు సైతం ఆందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

Sea Snake

మరిన్ని ఏపీ వార్తల కోసం..