December: పిప్పిప్పి.. డుండుండుం.. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి.. డిసెంబరులో వేలాదిగా వివాహాలు

తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మూడు నెలలుగా ముహూర్తాలు లేవు. మాఘమాసంలో కూడా పెద్దగా మంచి రోజులు లేవు. అందుకే డిసెంబర్‌ 2 నుంచి 21 వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో.. వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా అయితే.. మూడున్నర లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి.

December: పిప్పిప్పి.. డుండుండుం..  తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి.. డిసెంబరులో వేలాదిగా వివాహాలు
Wedding
Follow us

|

Updated on: Dec 01, 2022 | 9:54 AM

మూడునెలల నుంచి ఎప్పుడెప్పుడూ మూఢం పోతుందా.. ముహూర్తాలు వస్తాయా అని ఎదురుచూసిన ఎంతోమంది డిసెంబర్‌లో ఒక్కటవబోతున్నారు. నవంబరుతో మూఢం పోతోంది. డిసెంబరు నెల మొత్తం ఇక పెళ్లి సందడే.. డిసెంబర్‌ మాసంలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలకి, ఈవెంట్‌ మేనేజర్లకీ గిరాకీ పెరిగింది.

మూఢం కారణంగా మూణ్నెళ్లు బ్రేక్

డిసెంబరు 2 నుంచి భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడనున్నాయి. డిసెంబరులో కూడా నాలుగైదు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, రిసెప్షన్‌ వేడుకలతో మండపాలు కిక్కిరిసిపోనున్నాయి. సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయి. అయితే మూడు నెలలుగా మూఢాల కారణంగా మాంగళ్యం తంతునానేనా కు బ్రేక్‌ పడింది. అక్టోబరు, నవంబరు నెలల్లో మంగళవాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబరు నెలాఖరుతో మూఢం ముగియడంతో కొత్త జంటలు వివాహ వేడుకలకు సిద్ధమయ్యాయి.

బుక్కయిన కల్యాణ మండపాలు, బాంక్వెట్‌ హాళ్లు

అది కూడా..డిసెంబరు 2 నుంచి 21 వరకే మంచి రోజులున్నాయి. ఆ తర్వాత పుష్యమాసం వస్తుంది. ఆ నెలంతా, అంటే జనవరి రెండో భాగం వరకు మంచి ముహూర్తాలు లేవు. అలాగని మరికొంత కాలం వేచి చూడాలని భావించినా.. 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాఘ, ఫాల్గుణ మాసాల్లో కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో అంటే ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మూఢం వస్తోంది. శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు. దీంతో డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే డిసెంబరు 20లోగా వేలాదిగా వివాహాలు జరగనున్నాయని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల 2 వేలకు పైగా కల్యాణ మండపాలు, 2 వేల వరకు బాంక్వెట్‌ హాళ్లు ఉన్నాయి. ఇవన్నీ పెళ్లిళ్లు, రిసెప్షన్లకు బుక్‌ అయిపోయాయని, కొన్ని మ్యారేజ్‌ హాల్స్‌ ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు బుక్‌ చేసుకోవాల్సినంత రద్దీ ఏర్పడిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

నార్త్‌లో మూడు లక్షలకు పైగా పెళ్లిళ్లు

తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే..ఇక దేశ వ్యాప్తంగా చూస్తుంటే..ఒక్క నార్త్‌లోనే మూడు లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయట. ఇందుకోసం రెండు లక్షల కోట్లకు పైగా బిజినెస్‌ కూడా జరుగుతోందట. మరోవైపు, కొవిడ్‌ కారణంగా ఎన్‌ఆర్‌ఐలు స్వదేశానికి వచ్చేందుకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. భారత్‌ వస్తే మళ్లీ తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు సడలించారు. పైగా డిసెంబరులో అమెరికాలో క్రిస్మస్‌ సందడి ఉంటుంది. ఎన్నారైలకు ఈ సమయంలో సెలవులు సులభంగానే దొరుకుతాయి.. దీంతో, విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన యువతీ యువకులు రెక్కలు కట్టుకుని స్వదేశంలో వాలిపోయి ఓ ఇంటివారవుతున్నారు. దగ్గరి బంధువులు విదేశాల్లో ఉన్న వారు కూడా డిసెంబరు అయితే సౌకర్యంగా ఉంటుందని వివాహాలు నిశ్చయించుకున్నారని పురోహితులు చెబుతున్నారు. సో.. మొత్తానికి డిసెంబర్‌ మొత్తం.. పిప్పిప్పి.. డుండుండుం..అన్నమాట.

మరిన్ని తాజా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!