Coffee Health: మానసిక ఉల్లాసానికే కాదు.. గుండె ఆరోగ్యానికీ కాఫీ మంచి డ్రింక్.. ఇంకెన్నో ప్రయోజనాలు
ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి వేడి కాఫీ తాగడం మంచి అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా తగినంత మోతాదులో కాఫీ తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పలు పరిశోధనల్లో...
ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి వేడి కాఫీ తాగడం మంచి అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా తగినంత మోతాదులో కాఫీ తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పలు పరిశోధనల్లో తేలింది. రోజూ 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కాఫీ తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. మితమైన కాఫీ గుండె-ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించబడిన కొత్త పరిశోధన కాఫీ తాగడం, ఎక్కువ కాలం జీవించడం మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు. వివిధ రకాల కాఫీలు తాగడం వల్ల గుండె లయ, హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి పరిశోధకులు యూకే బయోబ్యాంక్ నుంచి డేటాను ఉపయోగించారు. 40, 69 సంవత్సరాల మధ్య వయస్సు గల 5 లక్షల మంది వాలంటీర్ల హెల్త్ డేటా ఆధారంగా జరుగుతున్న అతిపెద్ద అధ్యయనం అని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. రోజూ ఎన్ని కప్పుల కాఫీ తాగుతున్నారు. ఏ రకమైన కాఫీ తాగారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఫాలో-అప్‌లో అన్ని రకాల కాఫీలు మరణించే ప్రమాదాన్ని తగ్గించగలవని పరిశోధకులు కనుగొన్నారు.
ఇన్‌స్టంట్ కాఫీ.. ప్రమాదాన్ని 11%గా తగ్గించింది. అయినప్పటికీ, అన్ని రకాల కాఫీలు రక్షణను అందిస్తాయని నిరూపితమైంది. హృదయ సంబంధ వ్యాధుల విషయానికి వస్తే అన్ని రకాల కాఫీలు సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రభావం రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వినియోగ స్థాయిలోనూ కనిపిస్తుంది. గ్రౌండ్ కాఫీ 20%గా, డెకాఫ్ కాఫీ 6% ప్రమాదాన్ని తగ్గించింది. కాఫీ లో కాఫీన్ యాంటీఅరిథమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎవరైనా అధిక మొత్తంలో కాఫీ తాగితే నిద్ర లేమి లేదా ఇతర ప్రతికూల ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కాఫీలో చక్కెర వంటి వాటిని కలుపుతున్నారనే దాని గురించి ముందుగా తెలుసుకోవాలి. కొన్ని కాఫీ పానీయాలను తయారు చేసే సమయంలో అధికంగా చక్కెరను ఉపయోగిస్తుంటారు. కేలరీలు అధికంగా ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాఫీ ప్రయోజనాలు అందకుండా పోతాయి.
కాఫీ తాగడం ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్నప్పటికీ.. ఇష్టం ఉంటేనా తాగాలని, బలవంతంగా కాఫీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌టెన్షన్ కోసం మందులు తీసుకుంటుంటే కొంచ యాంగ్జైటీ ఉంటుంది. అలాంటి వారికి కాఫీ దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కాఫీ లోని కెఫిన్ రక్తపోటు మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం