కూరగాయల రైతుకి ఈ కష్టాలెన్నాళ్లు..? గిట్టుబాటు ధర రాక మార్కెట్లోనే భోరున విలపిస్తోన్న దయనీయ స్థితి

కూరగాయల రైతుకి ఈ కస్టాలు ఎన్నాళ్లు. వర్షాకాలంలో చేతికొచ్చిన పంటకు మంచి ధర ఉంటుందన్న వారి ఆశలపై

కూరగాయల రైతుకి ఈ కష్టాలెన్నాళ్లు..? గిట్టుబాటు ధర రాక మార్కెట్లోనే భోరున విలపిస్తోన్న దయనీయ స్థితి
Market

Vegetable farmers: కూరగాయల రైతుకి ఈ కస్టాలు ఎన్నాళ్లు. వర్షాకాలంలో చేతికొచ్చిన పంటకు మంచి ధర ఉంటుందన్న వారి ఆశలపై నీళ్లు జల్లినట్లైంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రైతుల దయనీయ స్థితి.. కంటతడిపెట్టిస్తోంది. గిట్టుబాటు ధరలేక పంటను రోడ్లపైనే పారబోసిన ఘటనలు మనం చూశాం. అయినా సిచువేషన్‌ మారలేదు. ఈ నెల కూడా కూరగాయల ధరల్లో మెరుగుదల లేదు. దీంతో నామమాత్రపు ధరలకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.

సగటు జీవి మార్కెట్‌కు వెళ్లి కొనాలంటే.. ఒక్కో కూరగాయ ధర.. కేజీ 40 నుంచి 80రూపాయల వరకు ఉంటోంది. కాని అదే రైతు అమ్మాలంటే ఐదారు రూపాయల కన్నా ఎక్కువ దక్కడంలేదు. దీనికి ప్రధాన కారణం దళారులే. పది ఇరవై రూపాయలు ఎక్కువ ధర చేసి మార్కెట్లలోకి తీసుకొస్తున్నారు. దీంతో అటు రైతు నష్టపోతున్నాడు, ఇటు వినియోగదారుడి జేబుకీ చిల్లుపడుతోంది.

కర్నూలు మార్కెట్‌లో పరిస్థితి గమనించింది టీవీ9. అక్కడ రైతులు పంటను అమ్ముకుంటున్న తీరును పరిశీలించింది. వంకాయలు, బీరకాయలు, టమాటా, చౌలకాయలు, చిక్కుడు, సొరకాయ ఇలా ఏ కూరగాయను పట్టుకున్నా.. ధర పది, ఇరవైకి మించి లేదు. కర్నూలు రైతు బజార్‌లోనే కన్నీరు పెట్టుకుంటున్న సన్నివేశాలు కనిపించాయి.

Read also: Anantapur: న్యాయం కోసం న్యాయవాదైన భర్త ఇంటి ముందు భార్య పోరాటం.!

Click on your DTH Provider to Add TV9 Telugu