Anantapur: న్యాయం కోసం న్యాయవాదైన భర్త ఇంటి ముందు భార్య పోరాటం.!
అనంతపురంలో ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కింది. తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనకు చెప్పకుండా
Lawyer’s wife fight for justice: అనంతపురంలో ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కింది. తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనకు చెప్పకుండా తన భర్త మరో వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధితురాలు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురానికి చెందిన న్యాయవాది మహబూబ్ బాషా తనకు అన్యాయం చేశాడంటూ అతడి భార్య సాధిక నిరసన వ్యక్తం చేస్తోంది. ఏడాది నుంచి భర్త తనతో వేరుగా ఉంటున్నాడని, మూడు రోజుల క్రితం తాడిపత్రిలో మరో వివాహం చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, అనంతపురం కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉద్యోగం చేస్తోంది సాధిక. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. తన బిడ్డ నుంచి కూడా తనను విడదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. న్యాయవాది వృత్తిలో ఉంటూ కట్టుకున్న భార్యకే అన్యాయం చేశాడంటూ విలపిస్తోంది. తనను పుట్టింటికి పంపి.. మరో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన చెందుతోంది.
దీంతో తీవ్ర ఆవేదనతో భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది ఆ ఇల్లాలు. నగరంలో న్యాయవాదిగా పని చేస్తున్న మహబూబ్ బాషాకు కలెక్టరేట్ లోని ట్రెజరీలో పని చేస్తున్న సాధికకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఏడాది భార్యతో గొడవ పడి భార్యను పుట్టింటికి పంపాడు. అప్పటి నుంచి అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వలేదు. అయితే మూడు రోజుల క్రితం మహబూబ్ బాషా మూడు రోజుల క్రితం తాడిపత్రిలో మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న సాధిక ఇవాళ తన కుటుంబసభ్యులతో కలసి అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. తనకు తన కుమారునికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
Read also: Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..