Current Bill: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నాగమణి హోటల్‌కు కోట్లలో కరెంటు బిల్లు
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి హోటల్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయలు
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి హోటల్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చింది. అంత బిల్లు రావడంతో హోటల్ యజమాని నిర్ఘాంతపోయాడు. ఏకంగా కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న హోటల్ యజమాని తలపట్టుకున్నాడు. ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు సెప్టెంబర్‌లో కరెంట్ బిల్లులు అధిక మొత్తంలో వచ్చాయి. వాడిన యూనిట్లకు టారిఫ్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో పాటు అదనంగా ‘ట్రూ అప్’ ఛార్జీలు యూనిట్‌కి రూ.1.23 చొప్పున చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు.
రిటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి డిస్కమ్‌ల ద్వారా జరిగిన లావాదేవీల్లో వచ్చిన నష్టాలకు గానూ ప్రజల నుంచి అదనపు వసూళ్లకు ఈ ట్రూ అప్ ఛార్జీలు తీసుకొచ్చారు. దాంతో చాలా మందికి జులై కంటే తక్కువ విద్యుత్ వినియోగించినా బిల్లులు మాత్రం 20 నుంచి 40 శాతం ఎక్కువగా వచ్చాయి. 2014-19 వరకూ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఈ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయక తప్పదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చెబుతోంది.
ఏపీలో మొత్తం మూడు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరా జరుగుతోంది. రాయలసీమ 4 జిల్లాలతోపాటూ, నెల్లూరు జిల్లాలకు ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఈ మూడు సంస్థలు గత ప్రభుత్వ హయంలో ఎదురైన నష్టాలు పూడ్చుకోడానికి ఈ ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశ పెట్టారు.
Read also: Vinayaka Chaturthi: రాయదుర్గంలో 14వ శతాబ్దం నాటి దశభుజ గణపతి. టెంకాయ స్వామి దగ్గర ఉంచితే..