దేశ వ్యాప్తంగా మాంచి ఫామ్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై గురి పెట్టిందా? తెలంగాణతో పాటు, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తోందా? అంటే అవుననేలా ఉన్నాయి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో హాజరయ్యేందుకు వచ్చిన కిషన్ రెడ్డి.. ఏపీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయని విమర్శించారు. కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రజల సంక్షేమమే అజెండా కావాలన్న కిషన్ రెడ్డి.. కక్ష సాధింపు చర్యలుతో ఏం సాధించలేరన్నారు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మాధవ్‌ను గెలిపించాలంటూ ప్రజలను కిషన్ రెడ్డి అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. రాష్ట్రానికి అనేక విద్యా, పరిశోధన సంస్థలు వచ్చాయన్నారు. రాజకీయాల కోసం కొందరు కేంద్రంపై బురద జల్లుతున్నా.. తాము అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..