
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ మంత్రుల విమర్శలు.. తెలంగాణ మినిస్టర్ల కౌంటర్లతో ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోంది. తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల వెలువరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన టెండర్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కేసీఆర్ సూచన మేరకు సింగరేణి అధికారులు సత్యనారాయణ, సుబ్బారావు, బలరాం తదితరులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించారు. ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశం కానున్నారు.
ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమై.. తాజా పరిస్టితులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా ఫగన్ సింగ్ ఆహ్వానించారు. ఈ మేరకు కులస్తే రాక, సమావేశం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే తెలంగాణ సింగరేణి నుంచి ముగ్గురు డైరెక్టర్లు వెళ్లిన సమయంలోనే ఫగన్ సింగ్ కులస్తే విశాఖ పర్యటనకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తెలంగాణకు కేంద్రం విక్రయించడం లేదన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 3500 కోట్లు ఎవరు పెట్టుబడి పెడతారో వారిని బిడ్డింగ్‌కి పిలవడం జరిగిందన్నారు.
ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత ఇప్పటివరకూ ప్లాంట్ వైపు వెళ్లడానికి కేంద్ర మంత్రులు సాహసించని నేపథ్యంలో మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..