AP News: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కు వచ్చారు.. ఆపై ఫోన్‌పే చేస్తుండగా

దొంగలు పెట్రోలు బంకులను టార్గెట్‌ చేశారా అంటే అవుననే అనిపిస్తోంది. అనంతపురంలో రెండు పెట్రోలు బంకుల్లో చోరీకి పాల్పడి లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్తే... మరోచోట కొందరు బంకులో పెట్రోలు కొట్టించుకొని మనీ ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నట్టు నటిస్తూ.. బంక్‌ సిబ్బందికి టోకరా ఇచ్చి పారిపోయారు.

AP News: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కు వచ్చారు.. ఆపై ఫోన్‌పే చేస్తుండగా
Ap News

Updated on: Mar 27, 2025 | 12:57 PM

ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువై;పోతున్నాయి. క్రియేటివిటీ ఉపయోగించి.. అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి తరహ ఘటన ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. ఇటీవల అన్ని పేమెంట్స్ యూపీఐలో జరుగుతున్నాయ్. ఇక దాన్ని తమకు వీలుగా చేసుకుని.. పెట్రోల్ బంక్ సిబ్బందిని మోసం చేసి ఉడాయించారు. ఆ వివరాలు..

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

అది గుంటూరు. కొరిటిపాడు ఏరియా.. రాత్రి 10 గంటల సమయంలో హరిహర మహల్ సెంటర్‌లోని పెట్రోల్ బంకు‌లోకి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. రూ. 1000కి పెట్రోల్ కొట్టమని అక్కడున్న సిబ్బందిని అడిగారు. డబ్బులు ఫోన్ పే చేస్తామని.. పెట్రోల్ కొట్టమని అక్కడున్న వ్యక్తికి చెప్పారు. అతడు కూడా ఈ ఇద్దరు యూపీఐ చేస్తారేమోనని అనుకుని.. పెట్రోల్ కొట్టాడు. కాసేపు ఆ ఇద్దరు యువకులు ఫోన్ పే చేస్తున్నట్టుగా నటించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా

ఈలోపు పెట్రోల్ బంక్‌లో రద్దీ పెరిగింది. ఈలోగా.. ‘టింగ్.. టింగ్’.. అంటూ డబ్బులు పడినట్టే ఫోన్ పే మెసేజ్ వచ్చింది. ఇక పెట్రోల్ కొట్టేవాడు.. తన పని ముగించుకుని చెక్ చేయగా.. ఆ యువకులు కేవలం రూ. 95 మాత్రమే ఫోన్ పే చేసి వెళ్లిపోయారని గుర్తించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన పెట్రోల్ బంక్ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా విజువల్స్ సాయంతో యువకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..