AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సూపర్.. బైక్ దొంగలను పట్టుకున్న మహిళా గార్డ్స్..

ద్విచక్రం వాహానాన్ని నెట్టుకుంటూ ఇద్దరు యువకులు వస్తున్నారు. దానిపై మెడికల్ స్టిక్కర్ కూడా వేసి ఉంది. ఎవరికి అనుమానం రాదనుకున్నారో ఏమో ఆ యువకులు బండిని నెట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. మహిళా గార్డ్స్ అనుమానంతో ఎందుకు బండిని నెట్టుకుంటూ వెళుతున్నారని ప్రశ్నించారు. అయితే స్టార్ట్ కావడం లేదని యువకులు చెప్పారు. అయితే వారిద్దూ ప్రవర్తనపై అనుమానం వచ్చిన గార్డ్స్ వెంటనే బైక్ వద్దకు వెళ్లి తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టారు.

Andhra Pradesh: సూపర్..  బైక్ దొంగలను పట్టుకున్న మహిళా గార్డ్స్..
Woman Guards
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 06, 2023 | 5:52 PM

Share

గుంటూరులో జీజీహెచ్ అతి పెద్ద ఆసుపత్రి. ప్రతి రోజూ రెండు మూడు వేల మంది రోగులు ఓపి విభాగం చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా వస్తుంటాయి. ఇందుకోసం ఐదారు ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్లులు కూడా పెట్టారు కూడా. అయితే ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనల దొంగల ముఠా జీజీహెచ్ పై కన్నేసింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులు, వారి బంధువులు వైద్యం కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. చోరులు తమ చేతివాటం చూపించేవారు. అయితే ఆసుపత్రిలోని భద్రత కోసం మహిళా గార్డ్స్‌ను నియమించారు. వాహనాలను పార్కింగ్ ప్లేస్ లో పెట్టించడంతో పాటు.. ఇతరులు లోపలికి రాకుండా కాపాలా కాయడం వీరి పని. అయితే ఆదివారం రోజు కావటంతో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారుల సంఖ్య తక్కువగా ఉంది. జీజీహెచ్ గేటు వద్ద సోనాభాయి. సంధ్యారాణి అనే ఈ ఇద్దరూ మహిళా గార్డ్స్ కాపాలా కాస్తున్నారు.

ఈ క్రమంలోనే ద్విచక్రం వాహానాన్ని నెట్టుకుంటూ ఇద్దరు యువకులు వస్తున్నారు. దానిపై మెడికల్ స్టిక్కర్ కూడా వేసి ఉంది. ఎవరికి అనుమానం రాదనుకున్నారో ఏమో ఆ యువకులు బండిని నెట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. మహిళా గార్డ్స్ అనుమానంతో ఎందుకు బండిని నెట్టుకుంటూ వెళుతున్నారని ప్రశ్నించారు. అయితే స్టార్ట్ కావడం లేదని యువకులు చెప్పారు. అయితే వారిద్దూ ప్రవర్తనపై అనుమానం వచ్చిన గార్డ్స్ వెంటనే బైక్ వద్దకు వెళ్లి తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టారు. కానీ ఆ యువకులు మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్పడం మొదలు పెట్టారు. దీంతో మహిళా గార్డ్స్ అనుమానం మరింత పెరిగింది. ఒక గార్డు మాట్లాడుతుండగానే మరొకరు సూపర్ వైజర్ కు ఫోన్ చేశారు. దీంతో ఆ యువకులిద్దరిలో కంగారు ఎక్కువైంది. ఒక యువకుడు అక్కడ నుండి పారిపోయాడు. మరొక యువకుడు కూడా పారిపోయే ప్రయత్నం చేయడంతో గార్డ్స్ ఇద్దరూ సాహసించి ఆ యువకుడిని పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ దొంగ అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా మహిళా గార్డ్స్ దొంగను వదిలి పెట్టలేదు. అదే సమయంలో భద్రత సిబ్బంది అక్కడకు రావడంతో దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు. ధైర్యంగా దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంధ్యారాణి, సోనాభాయ్ లను ఆసుపత్రి సూపరింటిండెంట్ అభినంధించారు. ఎంతో కాలంగా బైక్ దొంగతనాలు జరుగుతున్నా ఎవరూ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేదన్నారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో మహిళా గార్డ్స్ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న పిల్లల అపహరణ కేసులు గతంలో ఉన్నాయని వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటే దొంగలను పట్టుకోవచ్చన్నారు. ఏది ఏమైనా బైక్ దొంగతనం జరగకుండా చూడటమే కాకుండా దొంగలను పట్టుకున్నందుకు గార్డ్స్ పనితీరును ప్రశంసించారు.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు