AP News: గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు

గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుండి గుంటూరు వస్తున్న ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి లగేజ్ చెక్ చేయగా 68 గ్రాముల డ్రగ్స్ దొరికింది. వారిద్దిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో అన్నదానిపై విచారణ ప్రారంభించారు.

AP News: గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు
Arrested In Drug
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 18, 2024 | 6:39 PM

రాత్రి సమయంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కోలాహలంగా ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, వస్తున్న బస్సులతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంది. ప్రయాణీకులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే అదే సమయంలో కొత్తపేట పోలీసులు ఆర్టిసి బస్టాండ్ వద్దకు వచ్చారు. అటుగా వెలుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆపారు. బస్సులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వారికొచ్చిన ముందుస్తు సమాచారం మేరకు ఆ బస్సులో వారందరిని చెక్ చేశారు. వారికొచ్చిన సమాచారం నిజమే అయింది.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుండి గుంటూరు వస్తున్న ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి లగేజ్ చెక్ చేయగా 68 గ్రాముల డ్రగ్స్ దొరికింది. వారిద్దిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో అన్నదానిపై విచారణ ప్రారంభించారు. పెడ్లర్ బెంగళూరులో ఉన్నట్లు అనుమానితులు చెప్పడంతో ప్రత్యేక పోలీస్ బృందం బెంగళూరికి బయలు దేరింది. రవాణా చేస్తున్న వారితో పాటు వారికి విక్రయించిన వారిని అదే విధంగా కొనుగోలు చేసే వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.

అయితే గతంలోనూ కొంతమంది గుంటూరుకు చెందిన డ్రగ్స్ రవాణా చేసే వారిని పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నారు. దీంతో ఈ డ్రగ్స్ రవాణా చేసిన వారికి గత నేరస్తులతో సంబంధం ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడంతో విద్యార్ధులనే టార్గెట్ చేసి కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గుంటూరు పోలీసులు ఎప్పటికప్పుడు కాలేజ్ హాస్టల్స్‌పై తనిఖీలు చేస్తూ విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు పకడ్బందిగా చర్యలు చేపట్టినా అడపాదడపా గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు
గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్నవాదాలు.. టెలికాస్ట్ ఆపేయాలని పిటిషన్
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్నవాదాలు.. టెలికాస్ట్ ఆపేయాలని పిటిషన్
మీ పొదుపు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఏమవుతుంది?
మీ పొదుపు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఏమవుతుంది?
సోదరుడిపై చీటింగ్ కేసు నమోదు: స్పందించిన కేంద్రమంత్రి జోషి
సోదరుడిపై చీటింగ్ కేసు నమోదు: స్పందించిన కేంద్రమంత్రి జోషి
కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన యంగ్ బ్యూటీ.
కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన యంగ్ బ్యూటీ.
నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన రైతులు... అసలేం జరిగిందంటే
నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన రైతులు... అసలేం జరిగిందంటే
కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..
కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టీవీ 9.. ఎస్ఎఫ్‌ఏతో కీలక ఒప్పందం..
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టీవీ 9.. ఎస్ఎఫ్‌ఏతో కీలక ఒప్పందం..
రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది..!
రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది..!
అవును నిజం..! ఈవిడ.. ఆవిడే..
అవును నిజం..! ఈవిడ.. ఆవిడే..