AP News: వాహనదారులు జర జాగ్రత్త.. లేకుంటే మీ బండ్లు కూడా ఇలానే..

ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌‌తో పాటు నీళ్లు కూడా వచ్చాయి. వాహనదారులు పెట్రోల్ కొట్టించుకున్న కొద్దిసేపటికి బండి ట్రబుల్ ఇవ్వడంతో చెక్ చేయగా పెట్రోల్‌లో నీళ్ళు కలిసినట్లు గుర్తించారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? పెట్రోల్ బంకులోకి నీళ్లు ఎలా వచ్చాయి? అనేది మీరే చూడండి...!

AP News: వాహనదారులు జర జాగ్రత్త.. లేకుంటే మీ బండ్లు కూడా ఇలానే..
Water In Petrol
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 18, 2024 | 6:02 PM

అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులోని నయారా పెట్రోల్ బంకులో పెట్రోల్‌‌తో పాటు నీళ్లు కూడా వచ్చాయి. అయితే వాటిని గమనించని పెట్రోల్ బంకు సిబ్బంది వాహనదారులు అలాగే పెట్రోల్‌ను ఫిల్ చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ కొట్టించుకున్న కొద్దిసేపటికి బండి ట్రబుల్ ఇవ్వడంతో చెక్ చేయగా పెట్రోల్‌లో నీళ్ళు కలిసినట్లు గుర్తించి సిబ్బందికి చెప్పారు. ఆయనా సిబ్బంది పట్టించుకోకుండా వచ్చిన వాహనాలకు అలానే పెట్రోల్ ఫిల్ చేస్తూ ఉండడంతో ఒక వ్యక్తి బండిలో కాకుండా ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ ఫిల్ చేయమనడంతో సిబ్బంది చేసేదేమీ లేక బాటిల్లో కొట్టారు. అంతే పెట్రోల్ నీరు కలిసి ఫీల్ అవుతున్నాయని గమనించారు దీంతో సీజైన వాహనదారులకు కొంతమేర నష్టపరిహారం చెల్లిస్తామని నయారా బంక్ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. అయితే అసలు పెట్రోల్ బంక్‌లో ట్యాంక్‌‌లోకి నీళ్లు ఎలా చేరాయి అని ఆరా తీస్తే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసాయి. అంతేకాకుండా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో బంకులోకి కూడా వర్షపు నీరు చేరడంతో ఆ నీరు ట్యాంక్లోకి వెళ్లిందని తెలుస్తుంది.

పెట్రోల్ బంక్ నిర్వహించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ట్యాంక్ లోనికి ఎటువంటి నీళ్లు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. అయితే నయారా బంకు యాజమాన్యం అలా చేయకపోవడం వల్లే తమ బండ్లు అన్ని సీజ్ అయినట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నీరు వస్తుందని చెప్పినా కనీసం సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఎక్కువ అవ్వడంతో చేసేదేమీ లేక యాజమాన్యం వాహనదారులకు నష్టపరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి