AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI Arrest: అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు.

NRI Arrest: అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!
Phani Talluri
Balaraju Goud
|

Updated on: Oct 18, 2024 | 10:15 AM

Share

పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. తెలుగు వారికి అండగా నిలిచానన్నాడు. అంతా తానై ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మారు తెలుగువారు. ఇన్నాళ్ల తర్వాత అసలు రంగు తెలిసి అవాక్కయ్యారు. ఛీ. ఇంతటి నీచుడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా వర్జీనియాలో తెలుగు వ్యక్తి ఫణి తాళ్లూరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికపై పలుమార్లు లైంగికదాడికి తెగబడినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లైంగికదాడితోపాటు నగ్నఫొటోలతో బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. వేధింపులు భరించలేక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. 2022 నుంచి దర్యాప్తు చేపట్టిన అమెరికా పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫణి తాళ్లూరి అడల్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్నాడు.

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. ఫణి తాళ్లూరిపై వస్తున్న ఆరోపణలు అన్ని రుజువైతే ఆయనకు 60ఏళ్లు శిక్ష పడే అవకాశముంది. అమెరికాలో లైంగికదాడి కేసులో తెలుగువాడి అరెస్టు కలవరం పుట్టించింది. తెలుగు కమ్యూనిటీలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ఫణి బాధితులు చాలామందే ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో మైనర్లపై ఫణి అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా.. బయటకు వచ్చింది ఒక్కరే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫణి తాళ్లూరు అసలు రంగు ఇప్పటికైనా బయట పడిందంటున్నారు NRIలు. విరాళాల పేరుతో, సమాజ సేవ చేస్తున్నట్టు బిల్డప్‌ ఇస్తూ పెద్దమనిషిగా చలామణి అయ్యారని ఆరోపించారు. లైంగికదాడులతో ఫణి అసలు రంగు తెలియడంతో షాక్‌కు గురయ్యారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ‘వర్జీనియా యాష్‌బర్న్‌’ ప్రాంతం‌లో ఫణి తాళ్లూరి బాధితులు ఇంకా ఎందరున్నారు..? వాళ్లు కూడా నోరు విప్పుతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..