AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikash Yadav: కెనడా దారిలో అమెరికా..! ‘రా’ మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన ఆరోపణలు..!

భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై ఎటువంటి సాక్ష్యాలు లేవని కెనడా ప్రకటించిన వెంటనే భారత్‌కు చెందిన మాజీ ఉద్యోగి వికాస్‌ యాదవ్‌పై అమెరికా కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

Vikash Yadav: కెనడా దారిలో అమెరికా..! 'రా' మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన ఆరోపణలు..!
Vikas Yadav
Balaraju Goud
|

Updated on: Oct 18, 2024 | 10:55 AM

Share

భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై ఎటువంటి సాక్ష్యాలు లేవని కెనడా ప్రకటించిన వెంటనే భారత్‌కు చెందిన మాజీ ఉద్యోగి వికాస్‌ యాదవ్‌పై అమెరికా కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత, అమెరికా పౌరుడైన గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ‌ హత్యకు వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. దీని ఆధారంగా న్యూయార్క్‌ కోర్టు వికాస్‌ యాదవ్‌పై అక్టోబర్‌ 10న అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. హత్యకు సుపారీ తీసుకోవడం, కుట్ర, మనీలాండరింగ్‌ అభియోగాలను వికాస్‌ యాదవ్‌పై అమెరికా మోపింది. పన్నూ‌ హత్యకు మరొకరితో కలిసి కుట్రపన్నారని కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రంలో అమెరికా పేర్కొంది.

గురువారం(అక్టోబర్ 17)న మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌పై మాన్‌హాటన్‌లోని ఫెడరల్ కోర్టులో ఛార్జ్ షీట్ ఓపెన్ చేసింది. ఇది అమెరికన్ గడ్డపై హత్యా ప్రణాళికకు మధ్య భారత ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆరోపించింది.

మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపుతూ న్యాయ శాఖ గత ఏడాది ఈ కేసులో అభియోగాలను మోపింది. ఆ ఛార్జిషీట్‌లో పేరు తెలియని భారత ప్రభుత్వ అధికారిని కూడా ప్రస్తావించారు. ప్రాసిక్యూటర్లు మొత్తం ప్లానింగ్ చేసినట్లు చెప్పారు. గురువారం విడుదల చేసిన కొత్త నేరారోపణలో రా అధికారిని వికాస్ యాదవ్‌గా గుర్తించి, ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తా ఇద్దరూ హత్యకు కుట్ర పన్నారని, మనీ లాండరింగ్‌కు కుట్ర పన్నారని ఆరోపించారు.

గత ఏడాది చెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తాను అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. తాను నిర్దోషినని ప్రకటించుకున్నారు నిఖిల్ గుప్తా. న్యాయ శాఖ ప్రకారం, వికాస్ యాదవ్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికన్ పౌరులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటార్నీ జనరల్ మెరిక్ బి తెలిపారు. కాగా, పన్నూ ఒక అమెరికన్-కెనడియన్ పౌరుడు. అతను సిక్కు ఫర్ జస్టిస్ కోసం పని చేసిన ఖలిస్తాన్ మద్దతుదారు. నవంబర్ 29, 2023న న్యూయార్క్‌లోని తన సొంత కార్యాలయంలో పన్నూని చంపడానికి కుట్ర పన్నినట్లు యుఎస్ అధికారులు పేర్కొన్నారు. భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..