Samantha : మరోసమస్యతో బాధపడుతోన్న సామ్.. ఎవ్వరూ పట్టించుకోలేదంటూ ఎమోషనల్

ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసింది సమంత. కెరీర్ పీక్ లో ఉండగానే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.

Samantha : మరోసమస్యతో బాధపడుతోన్న సామ్.. ఎవ్వరూ పట్టించుకోలేదంటూ ఎమోషనల్
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 18, 2024 | 5:13 PM

అందాల భామ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసింది సమంత. కెరీర్ పీక్ లో ఉండగానే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఈ ఇద్దరూ కొంతకాలం అన్యూన్యంగా ఉన్నారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ సడన్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించగానే అభిమానులంతా షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

ఇక విడాకుల తర్వాత సమంత తన సినిమాలతో బిజీగా మారిపోయింది. ఆతర్వాత సమంత మాయోసైటిస్ బారిన పడింది. మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చికిత్స తీసుకుంటుంది. కాగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. హెల్త్ పరంగా.. అలాగే మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరం అయ్యింది సామ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి సినిమాలతో బిజీ కానుంది. ఇప్పటికే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తోంది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు , సిరీస్ లు చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటిస్తుంది సామ్. సిటాడెల్ అనే సినిమాలో నటిస్తుంది. వరుణ్ ధావన్, సమంత కలిసి నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ మాయోసైటిస్ గురించి మాట్లాడింది. అలాగే ఈ వ్యాధి కారణంగా ఒక్కసారిగా అంత మర్చిపోయేదాన్ని.. ఉన్నట్టుండి మతిమరుపు వచ్చినట్టు అయ్యేది. దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను అని తెలిపింది. తాను అంతగా ఇబ్బంది పడినా.. ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, అలాగే హెల్త్ గురించి ఎవ్వరూ అడగలేదు అని తలచుకుంటూ బాధపడుతూ ఉంటానని సమంత చెప్పుకొచ్చింది. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై సమంత అభిమానులు స్పందిస్తూ.. త్వరలోనే ఆమె కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ