AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Purandeswari: ఏపీ చేసిన అప్పులు రూ.10లక్షల కోట్లు పైచిలుకే.. అందుకే బీజేపీలో చేరాను..

Cross Fire with AP BJP Chief Purandeswari : టీడీపీతో పొత్తుని అధినాయకత్వం చూసుకుంటుంది.. టీడీపీలో ఏనాడూ సభ్యురాలిగా లేను.. రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్‌ వీడాను.. జాతీయ పార్టీలో ఉండాలనుకునే బీజేపీలో చేరాను.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో జవాబులు.. రాజకీయంగా ఏం జరగనుంది.. క్రాస్‌ఫైర్‌ విత్‌ రజినీకాంత్‌ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అనేక అంశాలపై స్పందించారు. వైసీపీతో ఏపీలో కలహం.. ఢిల్లీలో మైత్రిలా ఉన్న బంధంపైనా కామెంట్‌ చేశారు.

Purandeswari: ఏపీ చేసిన అప్పులు రూ.10లక్షల కోట్లు పైచిలుకే.. అందుకే బీజేపీలో చేరాను..
TV9 Cross Fire with AP BJP Chief Purandeswari
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 8:10 PM

Share

Cross Fire with AP BJP Chief Purandeswari : ఏపీ చేసిన అప్పులు పదిలక్షల కోట్లు పైచిలుకే.. ఏపీ అప్పులపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. టీడీపీ రాసిన స్క్రిప్టుని చదవడం అనేది ఆరోపణలే.. గతంలో టీడీపీ విధానాలను తప్పుబట్టాను.. వైసీపీ విమర్శలను పట్టించుకోనవసరం లేదు.. ఎన్నికల్లో పొత్తులు 2,3 నెలల ముందు నిర్ణయిస్తాం.. టీడీపీతో పొత్తుని అధినాయకత్వం చూసుకుంటుంది.. టీడీపీలో ఏనాడూ సభ్యురాలిగా లేను.. రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్‌ వీడాను.. జాతీయ పార్టీలో ఉండాలనుకునే బీజేపీలో చేరాను.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో జవాబులు.. రాజకీయంగా ఏం జరగనుంది.. క్రాస్‌ఫైర్‌ విత్‌ రజినీకాంత్‌ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అనేక అంశాలపై స్పందించారు. వైసీపీతో ఏపీలో కలహం.. ఢిల్లీలో మైత్రిలా ఉన్న బంధంపైనా కామెంట్‌ చేశారు.

ఏపీ చేసిన అప్పులు పదిలక్షల కోట్ల పైచిలుకే అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఆమె మరోసారి అప్పులపై మాట్లాడారు. తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. టీడీపీ రాసిన స్క్రిప్టే చదువుతున్నారు అన్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. టీడీపీపై చేసిన విమర్శలను వైసీపీ విస్మరిస్తోందని.. తాను రెండు పార్టీల తప్పుడు విధానాలను తప్పుబట్టినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

పొత్తులపై కూడా క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఆమె మరోసారి పొత్తులపై మాట్లాడారు. జనసేనతో పొత్తు ఉందని.. టీడీపీతో పొత్తులపై అధినాయకత్వమే చూసుకుంటుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అంటూ ఆమె.. ఫైనల్‌గా చెప్పారు.

అమరావతినే రాజధానిగా బీజేపీ ఆమోదిస్తుందన్నారు పురంధేశ్వరి. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పామన్నారు. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్‌.. రాజధాని మార్చడం వల్ల రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేమీ లేదన్నారు.

తాను ఏనాడూ టీడీపీలో సభ్యురాలిగా లేనన్నారు పురంధేశ్వరి. విభజన హామీల సమయంలో తన సూచనలను పక్కనబెట్టడం వల్లే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. జాతీయ పార్టీలో ఉండాలన్న యోచన వల్లే బీజేపీలో చేరానన్నారు పురంధేశ్వరి..

ఇలా ఎన్నో విషయాలపై బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాట్లాడారు.  ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ పురంధేశ్వరి వ్యాఖ్యలు ఎలా ప్రభావితం చేయనున్నాయి.. రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయి.. అనేది తెలియనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..