AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సంద్రంలో చేపల కోసం వల వేయగా.. చిక్కింది చూసి ఖంగుతిన్న జాలర్లు.!

కాసేపు వలను ఉంచగా.. కొద్దిసేపటికి తర్వాత ఏదో కదులుతున్నట్టు అనిపించింది. వెంటనే ఆ వలను బయటకు తీయడం ప్రారంభించారు. కొంచెం కష్టంగా అనిపించింది. అనుకున్న దానికంటే బరువు ఎక్కువ ఉంది. దీంతో వారికి ఏదో పెద్ద జాక్‌పాటే తగిలిందని సంబరపడ్డారు. తినబోతు రుచి ఎందుకు అని.. వలను త్వరగా బయటకు గుంజడం మొదలు పెట్టారు. ఆ పడవలో ఉన్న జాలర్లు అందరూ తలా చెయ్యి వేసి వలను ఎట్టకేలకు బయటకు లాగారు. అంతే.!

Viral: సంద్రంలో చేపల కోసం వల వేయగా.. చిక్కింది చూసి ఖంగుతిన్న జాలర్లు.!
Fisherman Catching Big Fish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 7:39 PM

Share

అనకాపల్లి, ఆగష్టు 7: రోజూ ఆ జాలర్లు చేపలు పట్టేందుకు వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆరోజు కూడా వల, కర్రలు, మిగతా సరంజామా అంతా సర్దుకుని పడవపై సముద్రంలోకి పయనమయ్యారు. ఎప్పటిలాగే వలకు పట్టిన చిక్కులు తీసి అంతా సెట్ చేసుకున్నారు. అనంతరం సముద్రంలోకి వేశారు. అలాగే కాసేపు వలను ఉంచగా.. కొద్దిసేపటికి తర్వాత ఏదో కదులుతున్నట్టు అనిపించింది. వెంటనే ఆ వలను బయటకు తీయడం ప్రారంభించారు. కొంచెం కష్టంగా అనిపించింది. అనుకున్న దానికంటే బరువు ఎక్కువ ఉంది. దీంతో వారికి ఏదో పెద్ద జాక్‌పాటే తగిలిందని సంబరపడ్డారు. తినబోతు రుచి ఎందుకు అని.. వలను త్వరగా బయటకు గుంజడం మొదలు పెట్టారు. ఆ పడవలో ఉన్న జాలర్లు అందరూ తలా చెయ్యి వేసి వలను ఎట్టకేలకు బయటకు లాగారు. అంతే.! ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ వారికి ఏం చిక్కాయో.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

సాధారణంగా ఒకే ప్రాంతంలో నుంచి వేటకు వెళ్లే మత్స్యకారులకు.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చేపలు చిక్కుతుంటాయి. కొందరికి భారీ చేపలు లభిస్తే… మరికొందరు చిన్నచిన్న చేపలతో ఒడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితి. డీప్ సీ లో వేట చేసే మత్స్యకారులకు భిన్నంగా ఉంటుంది తీరానికి దగ్గర్లో ఫిషింగ్ చేసే సాంప్రదాయ మత్స్యకారుల పరిస్థితి. అయితే అదృష్టం కొద్దీ.. ఒక్కోసారి తెప్పలపై వెళ్లే వారికి కూడా భారీ చేపలు చిక్కుతుంటాయి. అనకాపల్లి జిల్లాలో ఆ మత్స్యకారులకు జాక్‌పాట్ కొట్టినట్టు అయింది.

అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేట వాళ్ల జీవనాధారం. నిత్యం ఆ ప్రాంతం నుంచి సముద్రంలో వేటకు వెళ్తుంటారు జాలర్లు. అయితే ఈసారి వేటకు వెళ్ళిన వారందరి పంట పండింది. భారీ చేపలతో ఒడ్డుకు చేరుకున్నారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వరకు చేపలు పట్టుకొని హుషారుగా వచ్చారు.

పోటీపడి.. చేపలు ఎత్తుకెళ్లి..

రెండు రోజుల క్రితం వరకు రొయ్యల వేట సాగేది. మత్స్యకారులకు రొయ్యలు చిక్కేవి. కానీ.. సండే ఫిషింగ్‌కు వెళ్లిన గంగపుత్రులకు కాస్త భిన్నమైన పరిస్థితి కనిపించింది. భారీ టేకు చేపలు లభించాయి. భారీ సైజులో ఉన్న ఈ టేకు చేపలను పట్టుకుని ఆనందంలో మునిగితేలారు. మత్స్యకారులు ఒడ్డు వరకు పడవుల్లో తీసుకొచ్చి.. అక్కడ నుంచి భుజాలపై కర్ర సహకారంతో ఇద్దరేసి చొప్పున ఆ టేకు చేపలను పైకి తెచ్చారు. కిలో 400 రూపాయల ధర పలకడంతో మత్స్యకారుల పంట పండింది. పోటీపడి మరి ఈ టేకు చేపలను కొనుగోలు చేశారు వ్యాపారులు.