Cross Fire With Purandeswari: పురంధేశ్వరి టీడీపీ రాసిన స్క్రిప్టే చదువుతున్నారా..? ఆమె ఏమన్నారంటే..
Purandeswari Exclusive Interview: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినప్పటికీ.. ఏపీలో రాజకీయాలు తగ్గేదేలే అంటున్నాయి.. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ.. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు, టీడీపీతో ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వంతో సఖ్యత ఇలా ఎన్నో విషయాల గురించి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు.
Purandeswari Exclusive Interview: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినప్పటికీ.. ఏపీలో రాజకీయాలు తగ్గేదేలే అంటున్నాయి.. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ.. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు, టీడీపీతో ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వంతో సఖ్యత ఇలా ఎన్నో విషయాల గురించి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. క్రాస్‌ఫైర్ విత్ రజినీకాంత్ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అనేక అంశాలపై స్పందించారు. వైసీపీతో ఏపీలో కలహం.. ఢిల్లీలో మైత్రిలా ఉన్న బంధంపైనా కామెంట్ చేశారు. ఏపీ చేసిన అప్పులు పదిలక్షల కోట్ల పైచిలుకే అన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. టీడీపీ రాసిన స్క్రిప్టే చదువుతున్నారు అన్న విమర్శలకు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. అది రాజకీయ విమర్శ అంటూ కొట్టిపడేశారు. టీడీపీపై చేసిన విమర్శలను వైసీపీ విస్మరిస్తోందని.. తాను రెండు పార్టీల తప్పుడు విధానాలను తప్పుబట్టినట్లు చెప్పుకొచ్చారు. పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి… జనసేనతో పొత్తు ఉందని.. టీడీపీతో పొత్తులపై అధినాయకత్వమే చూసుకుంటుందంటూ వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

