AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa District: ప్రశ్నిస్తే బోరున ఏడ్చేసి.. ముక్కు చీదేసిన మహిళా సబ్ రిజిస్టార్..!

కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోగల జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరగాలంటే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుమతులు కావాలని తను ఆదేశిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు ఇదే అంశాన్ని స్థానిక రిజిస్టర్ కార్యాలయంకు వెళ్లి అక్కడి మహిళా రిజిస్టారు ప్రశ్నించగా మొదట అదేమీ లేదని మీ హయాంలో కూడా నేను ఇక్కడ పని చేశానని అప్పుడు నన్ను మెచ్చుకున్నారని కానీ ఇప్పుడు..

Kadapa District: ప్రశ్నిస్తే బోరున ఏడ్చేసి.. ముక్కు చీదేసిన మహిళా సబ్ రిజిస్టార్..!
Kadapa Sub Registrar
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 7:27 PM

Share

కడప, ఆగస్టు 7: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వెళితే అక్కడ జరిగే పరిణామాలు గురించి సామాన్యులకు చెప్పాల్సిన అవసరం లేదు. అటెండర్ నుంచి సబ్ రిజిస్టార్ వరకు తాయిలాలు ఇవ్వాల్సిందే ఇదేమీ కొత్తేమీ కాదు. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పరిస్థితిని గురించి సబ్ రిజిస్టార్ ను ప్రశ్నించినందుకు ఆ మహిళా సబ్ రిజిస్టర్ బోరున ఏడ్చేసింది.

కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోగల జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరగాలంటే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుమతులు కావాలని తను ఆదేశిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు ఇదే అంశాన్ని స్థానిక రిజిస్టర్ కార్యాలయంకు వెళ్లి అక్కడి మహిళా రిజిస్టారు ప్రశ్నించగా మొదట అదేమీ లేదని మీ హయాంలో కూడా నేను ఇక్కడ పని చేశానని అప్పుడు నన్ను మెచ్చుకున్నారని కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రశ్నిస్తారు అని వరదరాజుల రెడ్డిని ఆ సబ్రిజిస్టార్ అడిగారు .. అయితే దానికి వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే అధికారులు వింటున్నారని ఇది అధికార పార్టీ కార్యాలయంలో ఉందని ప్రభుత్వ కార్యాలయంలో లేదని వరదరాజుల రెడ్డి మండిపడ్డారు డాక్యుమెంట్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదని అధికార పార్టీ నాయకులకు తప్ప ఇక్కడ పనులే జరగడం లేదని ఆయన అన్నారు.

ఒక్కసారిగా ఏడ్చేసిన మహిళా సబ్ రిజిస్టార్

పొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు డాక్యుమెంట్లను నెలలు తరబడి అలాగే ఉంచి డబ్బులు ఇచ్చిన వారికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అలా కాకపోతే ఎమ్మెల్యే చెప్పిన వారికే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఈరోజు పొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంకు వెళ్లడంతో అక్కడ ఉన్న మహిళా సబ్ రిజిస్టర్ అలాంటిదేమీ లేదని ఎవరు వచ్చినా చేస్తున్నామని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే ఎవరిని వెయిట్ చేయించడం లేదని చెప్పడంతో మండిపడ్డ వరదరాజులు రెడ్డి మా వారికే రిజిస్ట్రేషన్లు కాలేదని 20 రోజులు అవుతున్నా కనీసం డాక్యుమెంట్ ముందుకు కదలలేదని గట్టిగా ప్రశ్నించడంతో ఒక్కసారిగా మహిళల సబ్ రిజిస్టర్ కంటతడి పెట్టుకుంది అయినా వరదరాజులు రెడ్డి ఏమాత్రం తగ్గకుండా మీరు ఏడ్చినా ఏం చేసినా ఇక్కడ అధికార పార్టీ నేతలకు తప్ప పనులు ఎవరికి జరగడం లేదని స్థానిక ఎమ్మెల్యే తన ఇష్టానుసారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

శిష్యుడిపై గురువు యుద్దం ప్రకటించాడా

శిష్యుడు మీద వరదరాజుల రెడ్డి యుద్ధం ప్రకటించినట్లు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి శిష్యుడు అయితే వరదరాజుల రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రస్తుతం టిడిపి టికెట్ ఆశిస్తూ ఉండడంతో మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వరద ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళుతూ ప్రజా సమస్యలపై పోరాడి అధికారులను నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద శిష్యుడి మీద గురువు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.