Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఉల్కిపడిన సిక్కోలు.. ఉపాధి కోసం వెళ్లిన 1000 మందికి పైగా జిల్లా వాసులు

| Edited By: Ravi Kiran

Feb 08, 2023 | 12:45 PM

టర్కీలో భూకంపంతో శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం ఉలిక్కిపడింది. ఎందుకంటే.. భూకంపం వచ్చిన ప్రాంతంలో సుమారు వెయ్యి మంది సిక్కోలువాసులు ఉన్నారు. టర్కీ, సిరియా సమీప ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ భూకంపం రావడంతో.. వాళ్లు ఎలా ఉన్నారోనని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

భూకంపం మిగిల్చిన విషాదంతో టర్కీ విలవిలలాడుతోంది. మృతుల సంఖ్యలో వేలల్లో ఉంటే బతికున్న వారి గాథ, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండి. శిథిలాల నుంచి బయటపడిన వారి ఆక్రందనలు.. అవస్థలు కన్నీరు పెట్టిస్తున్నాయి. భూకంపం మిగిల్చిన విషాదంతో హృదయ విదారకంగా మారింది టర్కీ బతుకు. 8 వేల మందిని బలితీసుకున్న ఈ ట్రాజెడీలో బాధితుల సంఖ్య 2 కోట్లకు పైనే అంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరోవైపు గాయపడ్డ 15 వేలమంది మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రపంచ దేశాలిస్తున్న చేయూత.. టర్కీ, సిరియాల్ని ఎప్పటికి గట్టెక్కిస్తాయన్న క్లారిటీ ఇప్పటికైతే లేదు. ఆ పీడకల నుంచి కొద్దికొద్దిగా బైటపడుతున్నాయి టర్కీ, సిరియా దేశాలు.

నిద్రలో ఉండగానే పేకమేడల్లా కూలిన భవనాలు..పేరుకుపోయిన టన్నుల కొద్దీ శిథిలాలు.. వాటిని తొలగించడానికి నిరంతరం పనిచేస్తున్న 600 జెయింట్ క్రేన్లు.. భారీగా కురుస్తున్న వర్షం, పొగమంచు…! వార్‌జోన్‌ని తలపిస్తోంది టర్కీలో భూకంప పీడిత ప్రాంతం. అయితే టర్కీ భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా శ్రీకాకుళం ఉల్కిపడింది. జిల్లాలోని ఉద్దానం ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ఉపాధి కోసం టర్కీకి చేరుకున్నారు. ఉద్దాన ప్రాంతం నుండి ఉపాధి కోసం వందలాది మంది కార్మికులు టర్కీకి వెళ్లారు. ముఖ్యంగా కవిటి, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం వాసులు ఉపాధికోసం వెళ్లినట్లు తెలుస్తోంది. వివిధ నిర్మాణ, ఇతర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. అయితే ఆ దేశంలో ఏర్పడిన పెను విషాదంతో ఇక్కడ కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాము క్షేమంగా ఉన్నామని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తగ్గింది.

సిరియా సరిహద్దుకు సుమారు 300 కి.మీ దూరంలో ఉన్న తుర్కియేలోని అదానా నగరానికి సమీపంలో ఉన్నాం. భూకంపం ఏర్పడిన సమయంలో తాము ఒక కంటైనర్లలో  నిద్రపోతున్నామని.. అందుకనే తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని శ్రీకాకుళం వాసులు చెప్పారు. భూకంపంతో ఏర్పడిన విధ్వసంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపామని తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత వారి ఆందోళన తగ్గిందని తెలిపారు. తమను తాము పనిచేస్తున్న సంస్థ బాగా చూసుకుంటుందని..  భూకంపం నేపథ్యంలో.. ఇప్పుడు పనికి రావద్దని తెలిపిందని చెప్పారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..