AP News: రైళ్లో విండో సీట్ కోసం ఎగబడుతున్నారా.? ఇది చూస్తే ఆ ధైర్యం చేయరు..

ముఖ్యంగా రైళ్లలో ఫోన్ మాట్లాడేవారు, కిటికీల పక్కన కూర్చునేవారు, తలుపుల దగ్గర నిల్చుని ఫోన్ మాట్లాడేవారికి ఈ ముఖ్య గమనిక. మీరు కాస్త ఆదమరిచి ఉన్నారో.. మీ జేబుకు క్షణాల్లో చిల్లుపడ్డట్టే. ఈ దొంగలు రైల్వే స్టేషన్లలో మాటు వేస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: రైళ్లో విండో సీట్ కోసం ఎగబడుతున్నారా.? ఇది చూస్తే ఆ ధైర్యం చేయరు..
Train Seat Number
Follow us

|

Updated on: Feb 12, 2024 | 12:57 PM

దొంగలు రూట్ మార్చారు. డబ్బులు కొట్టేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటూ.. అమాయకులను దోచేస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో ఫోన్ మాట్లాడేవారు, కిటికీల పక్కన కూర్చునేవారు, తలుపుల దగ్గర నిల్చుని ఫోన్ మాట్లాడేవారికి ఈ ముఖ్య గమనిక. మీరు కాస్త ఆదమరిచి ఉన్నారో.. మీ జేబుకు క్షణాల్లో చిల్లుపడ్డట్టే. ఈ దొంగలు రైల్వే స్టేషన్లలో మాటు వేస్తారు. కిటికీ పక్కన కూర్చునేవాళ్లు, తలుపుల దగ్గర నిల్చునేవాళ్ళే వీళ్ల టార్గెట్.. ఇలా ట్రైన్ కదిలిందో.. దెబ్బకు వాళ్ల చేతుల్లో ఉన్న మొబైల్స్, జేబుల్లోని పర్సులను కాజేసి మాయమైపోతుంటారు. గత రెండేళ్లుగా ఇదే తరహాలో దొంగతనాలు చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను తాజాగా కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

బొబ్బిలికి చెందిన శ్రీను, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్.. వీరిద్దరూ కూడా స్నేహితులు. గత కొన్నేళ్లుగా చెడు వ్యసనాలకు అలవాటై.. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. అందులో భాగంగానే రెండేళ్లు నుంచి తుని, సామర్లకోట రైల్వేస్టేషన్లలో మాటు వేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. రైలు కదులుతున్న సమయంలో మొబైళ్ళు, పర్సులు దొంగతనం చేసి ఉడాయించేవారు. ఆదివారం వీరిద్దరూ తుని రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా తాము చేసిన నేరాలను ఒప్పుకున్నారు. అలాగే వారి దగ్గర నుంచి రూ. 2 లక్షల నగదు, రూ. 1.33 లక్షల విలువ చేసే మొబైళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రైలులో తలుపుల దగ్గర నిల్చునేవారు, కిటికీల పక్కన కూర్చునేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.