Minister Roja: “వైఎస్ ఆశయాల కోసం జగన్.. ఆస్తుల కోసం షర్మిల”
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డ అన్నారు.. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి రోజా.. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డని అని చెప్పిన షర్మిల.. అక్కడ పెట్టిన పార్టీని గాలికొదిలేశారంటూ విమర్శించారు. ఇప్పుడు షర్మిల మరో కొత్త అవతారం ఎత్తారన్న రోజా.. కేవలం వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ వచ్చారంటూ ఆగ్రహించారు. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఎద్దెవా చేశారు. వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చిందని మంత్రి రోజా మండిపడ్డారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఏపీని విభజించిన కాంగ్రెసులో చేరి షర్మిల.. జగన్ పైన విషం చిమ్ముతోందని ఆగ్రహించారు రోజా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Feb 12, 2024 01:28 PM
వైరల్ వీడియోలు
Latest Videos