Telangana: తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఎక్కువ అన్యాయం జరిగింది: ఉత్తమ్

Telangana: తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఎక్కువ అన్యాయం జరిగింది: ఉత్తమ్

Ram Naramaneni

|

Updated on: Feb 12, 2024 | 1:47 PM

కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి తాము వ్యతిరేకమన్నారు. గతంలో కేసీఆర్, జగన్ చర్చల జరిపిన తరువాత తెలంగాణకు మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను 50శాతం అదనంగా ఏపీ తరలించుకుపోతోందన్నారు.

తెలంగాణలో KRMB కేంద్రంగా జలరాజకీయం రాజుకుంటోంది. కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని అసెంబ్లీలో చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి తాము వ్యతిరేకమన్నారు. గతంలో కేసీఆర్, జగన్ చర్చల జరిపిన తరువాత తెలంగాణకు మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను 50 శాతం అదనంగా ఏపీ తరలించుకుపోతోందన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల టెండరింగ్‌ ప్రక్రియ కోసమే.. 2020లో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ అడ్డుకోలేదన్నారు మంత్రి ఉత్తమ్‌రెడ్డి. బచావత్‌ అవార్డ్‌ ప్రకారం 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 60 శాతం ఉండాలని.. కానీ BRS కేవలం 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు శాశ్వతంగా విఘాతం కలిగేలా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు మంత్రి ఉత్తమ్‌. నీటి వాటాల విషయంలో తెలంగాణ హక్కుల్ని నాడు BRS ప్రభుత్వం కాలరాసిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 299 టీఎంసీలకు ఒప్పందాలు చేసుకున్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు 50 పర్సెంట్‌ షేరింగ్‌ అని మాట్లాడ్డం విడ్డూరమన్నారు.

గత ప్రభుత్వ విధానాల వల్ల నీటి వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఉత్తమ్‌. పాలమూరు రంగారెడ్డి స్కీమ్‌కు 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా అదనంగా నీరు అందించలేదన్నారు. అధికారంలో అలసత్వం వహించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు సభలు పెట్టి ఏం ప్రయోజనమని విమర్శించారాయన.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Feb 12, 2024 01:46 PM