AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి లడ్డూ రుచిలో లోపం.. అసలు కారణం గుర్తించిన టీటీడీ..

తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు నాణ్యతపై టీటీడీ దృష్టి పెట్టింది. టిటిడికి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత లేదని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యిలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలకు టిటిడి సిద్దం అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత అధ్వాన్నంగా ఉందని భక్తుల ఫిర్యాదులతో చర్యలు తీసుకుంటోంది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఈవో శ్యామలరావు లడ్డు తయారీకి వినియోగించే ముడిసరుకులు నాణ్యతపై దృష్టి పెట్టారు. సరుకుల్లో నాణ్యత లేదని పోటు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు.

Tirumala: శ్రీవారి లడ్డూ రుచిలో లోపం.. అసలు కారణం గుర్తించిన టీటీడీ..
Tirumala Laddu
Raju M P R
| Edited By: |

Updated on: Jul 23, 2024 | 6:15 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు నాణ్యతపై టీటీడీ దృష్టి పెట్టింది. టిటిడికి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత లేదని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యిలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలకు టిటిడి సిద్దం అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత అధ్వాన్నంగా ఉందని భక్తుల ఫిర్యాదులతో చర్యలు తీసుకుంటోంది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఈవో శ్యామలరావు లడ్డు తయారీకి వినియోగించే ముడిసరుకులు నాణ్యతపై దృష్టి పెట్టారు. సరుకుల్లో నాణ్యత లేదని పోటు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. నెయ్యి నాణ్యత అధ్వాన్నంగా ఉండటంతో లడ్డు నాణ్యత లోపిస్తోందని గుర్తించారు. ముడిసరుకుల నాణ్యతపై పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తిరుమలలో ఎఫ్.ఎస్.ఎస్.ఐ ద్వారా ప్రయోగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని టిటిడి నిర్ణయించింది.

నాణ్యత లేని ముడిసరుకులు పంపిణీ చేసిన గుత్తేదారులపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేక పోవడాన్ని ఈవో గుర్తించారు. గుత్తేదారులపై చర్యలు లేకపోవడంతో ముడిసరుకుల నాణ్యత పడిపోయిందని భావిస్తున్న టిటిడి.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యత, రుచికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నాణ్యతలేని నెయ్యి తో శ్రీవారికి లడ్డుప్రసాదం రుచి, నాణ్యత లేదన్న విషయాన్ని టిటిడి గుర్తించింది. నెయ్యిలో నాణ్యత లేకపోవడంపై టీటీడీ సీరియస్‎గా పరిగణిస్తోంది. సరఫరాదారులకు టీటీడీ ఈ మేరకు హెచ్చరించింది. నెయ్యి సేకరణ నిపుణుల కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో శ్యామల రావు తనిఖీ కోసం నెయ్యి శాంపిల్స్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపారు. టిటిడికి నెయ్యి సరఫరా చేస్తున్న 5 మంది సరఫరాదారుల్లో ఒకరు సప్లై చేసిన నెయ్యి నాణ్యత లేదని గుర్తించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు గుర్తించిన టిటిడి టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సప్లయిర్‎ను బ్లాక్ లిస్ట్ చేర్చేందుకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నెయ్యి సప్లై‎లో నిబంధనలు పాటించక పోతే చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఏడాదికి 5000 మెట్రిక్ టన్నుల నెయ్యిని కొనుగోలు చూస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కొత్తగా సప్లై చేస్తున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. కేజీ నెయ్యి ధర రూ. 351 నుంచి రూ.411 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో