Andhra Pradesh: శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు.. గేట్లకు తాళాలు వేసి నినాదాలు
నంద్యాల జిల్లా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి చొచ్చుకుని వెళ్లారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారూ నాయక్ ఆధ్వర్యంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల గిరిజనులు శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్న నిర్వహించారు. ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయంలోని..
నంద్యాల, డిసెంబర్ 13: నంద్యాల జిల్లా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి చొచ్చుకుని వెళ్లారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారూ నాయక్ ఆధ్వర్యంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల గిరిజనులు శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్న నిర్వహించారు. ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపి ప్రధాన గేట్లను మూసివేసి, తాళాలు వేసి నిరసనలు తెలిపారు. ఐటీడీఏ పీఓ బయటకు రావాలంటూ నినాదాలతో గిరిజనులు హోరెత్తించారు.
ముందుగా శ్రీశైలం మండలం సున్నపెంటలోని పోలేరమ్మ గుడి వద్దకు భారీగా చేరుకున్న గిరిజనులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలేరమ్మ గుడి నుంచి భారీ ర్యాలీగా టీడీపీ జనసేన జెండాలు పట్టుకుని ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారు నాయక్ మీడియాతో మాట్లాడుతూ…
‘శ్రీశైలం ఐటీడీఏ పీఓ వైసీపీ ఏజంట్ గా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డాడు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల గిరిజనులకు చెంచు గూడెలలో కనిస మౌలిక వసతులు కూడ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాలంలో చెంచుగూడెలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు గిరిజనుల గూడెంలు తయారయ్యాయని, గిరిజనులను పట్టించుకోవడం లేదని ధారూనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ఐటీడీఏ పీఓ ఎలక్షన్ సమయంలో వైసీపీ పార్టీకి ఓట్లకోసం గిరిజనుల వద్ద ఏజంట్ గా చేశారని, ఇప్పటివరకు గిరిజనులను పట్టించుకోలేదన్నారు’.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.