Arogyasri Limit: ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 25 లక్షలకు పెంపు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని, వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద 25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 చెల్లించాలని జగన్ ఆదేశించారు..
మీ జేబులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం గ్యారంటీ. ఏపీలో ఆరోగ్య శ్రీ పరిమితి పెంచనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇక రోగులకు రూ. 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా అందనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుపై బుధవారం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందన్నారు ఆయన. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి.. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని, వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద 25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 చెల్లించాలని జగన్ ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి కార్డుల పంపిణీ పూర్తి కానుంది. ఫేజ్–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి