Viral: మొన్న టమాటా., ఇప్పుడు మిర్చి.. రెచ్చిపోయిన దొంగలు. వీడియో వైరల్.
ఇటీవల టమాటా రేటు అమాంతం పెరిగిపోవడంతో అనేక చోట్ల టమాటా చోరీలకు పాల్పడ్డారు. రాత్రికి రాత్రి పొలాల్లో కోసి పెట్టిన టమాటాలు మాయం చేసేశారు. మార్కెట్‌కు తరలిస్తున్న టమాటా లోడు వాహనాలను సైతం ఎటాక్ చేసి దోచేశారు. ఇప్పుడు మిర్చి వంతు వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలో మిర్చి దొంగలు రెచ్చిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాత్రికి రాత్రే మాయం చేసేశారు. చీడపీడలకే సగం పంట నాశనమవగా..
ఇటీవల టమాటా రేటు అమాంతం పెరిగిపోవడంతో అనేక చోట్ల టమాటా చోరీలకు పాల్పడ్డారు. రాత్రికి రాత్రి పొలాల్లో కోసి పెట్టిన టమాటాలు మాయం చేసేశారు. మార్కెట్‌కు తరలిస్తున్న టమాటా లోడు వాహనాలను సైతం ఎటాక్ చేసి దోచేశారు. ఇప్పుడు మిర్చి వంతు వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలో మిర్చి దొంగలు రెచ్చిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాత్రికి రాత్రే మాయం చేసేశారు. చీడపీడలకే సగం పంట నాశనమవగా.. మిగిలిన సగం ఈ రకంగా దొంగలపాలవుతోందని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కలుగట్ల గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప పంటను సాగుచేశాడు. కోతకు వచ్చిన పంటను కోసి కర్నూలు రోడ్డులోని గ్రాండ్ మహల్ వద్ద ఆరబెట్టాడు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో మిరప అమ్మకాలకు మంచి రేటు పలుకుతుండటంతో మిరపపై దొంగల దృష్టి పడింది. రైతు శ్రీను ఆరబెట్టిన ఎండు మిర్చిపై కొంతమంది దొంగల కన్ను పడింది. అర్ధరాత్రి దోపిడీకి తెగబడ్డ దొంగలు సుమారు ఐదు క్వింటాల మిరప ను ఎత్తుకెళ్లిపోయారని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దొంగిలించిన మిర్చి విలువ సుమారు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంటుందని తెలిపాడు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో రైతు శీను ఫిర్యాదు చేయగ అక్కడికి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లు, కాసేపటికి పరుగెత్తిన దృశ్యాలను గుర్తించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

