AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chirala: ఈ ఇద్దర్ని అలలు మింగేశాయ్ – పాపం 2 కుటుంబాల్లో విషాదం

బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ అజీజ్‌ మృతదేహం ఒడ్డుకు తేలగా, రామాపురం బీచ్‌లో ఏడితి భానుచందర్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. వీకెండ్‌లో విహార యాత్రకు వచ్చిన కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి .

Chirala: ఈ ఇద్దర్ని అలలు మింగేశాయ్ - పాపం 2 కుటుంబాల్లో విషాదం
Abdulaziz -Bhanuchander
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 30, 2025 | 12:10 AM

Share

బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది… వీకెండ్‌ సెలవులు ఎంజాయ్‌ చేద్దామని వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో ఈతకు వెళ్లి అలల ఉధృతికి గల్లంతయ్యారు… వీరిలో ఒకరు చనిపోగా.. మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నారు. సముద్రతీరంలో విహారానికి వచ్చిన వారిలో ఇద్దరు మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది…

చీరాల మండలం వాడరేవు, రామాపురం సముద్ర తీరాల్లో సరదాగా ఈత కొడుతున్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు… వాడరేవు సముద్ర తీరంలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల అబ్దుల్‌ అజీజ్‌ తన స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకు వెళ్ళాడు. సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో అలలు ఎగసిపడటంతో సముద్రంలో గల్లంతయ్యాడు… కొద్దిసేపటికి అజీజ్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

అలాగే చీరాల మండలం రామాపురం బీచ్‌లో చీరాల పట్టణం వైకుంఠపురానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఏడితి భానుచందర్‌ గల్లంతయ్యాడు… కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం విహారయాత్రకు వచ్చిన భానుచందర్‌ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ధాటికి తట్టుకోలేక సముద్రంలో కొట్టుకుపోయాడు… భానుచందర్‌ తిరిగి రాకపోవడంతో సముద్రంలో గల్లంతైనట్టు తెలుసుకుని మెరైన్‌ పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు… భానుచందర్‌ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us