AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
Train
Anand T
|

Updated on: Jun 29, 2025 | 7:34 PM

Share

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి కన్యాకుమారి వెళ్లే (హైదరాబాద్-కన్యాకుమారి- 07230) ట్రైన్‌ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్‌ నుంచి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపింది. ఈ ట్రైన్ జులై రెండు నుంచి 25వ తేదీ మధ్యన నాలుగు ట్రిప్పులను పూర్తి చేస్తుందని రైల్వేశాఖ పేర్కొంది.

ఇక కన్యాకుమారి నుంచి హైదరాబాద్‌ వచ్చే 07229గల ట్రైన్‌ జులై 4 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ ట్రైన్‌ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి.. మరుసటిరోజు సాయంత్రం 2.30 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది.

ఈ ట్రైన్స్‌ ఎక్కడెక్కడ ఆగుతాయి..

నాంపల్లి-కన్యాకుమారి వెళ్లే ట్రైన్‌.. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లె, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, మయిలదుతురై, కుంభకోణం, తంజావూర్‌, తిరుచిరాపల్లి, దిండిగుల్‌, కొడైకెనాల్‌, మధురై, విరుదునగర్‌, సాతూర్‌, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, నాగర్‌ కోయిల్‌ స్టేషన్లలో ఆగుతుంది.

ట్రైన్‌లో అందుబాటులో ఉండే కోచ్‌లు..

ఈ ట్రైన్‌లో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ క్లాస్‌ బోగీలు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌-కన్యాకుమారి వెళ్లే ఇతర రైళ్లు..

హైదరాబాద్, కన్యాకుమారి మధ్య నడిచే ఇతర రైళ్లు కూడా ఉన్నాయి, వాటిలో KCG NCJ EXP (16353), KCG NCJ SPL (07435) ఉన్నాయి. ఈ రైళ్లు నాంపల్లికి బదులుగా కాచిగూడ స్టేషన్ నుండి బయలుదేరవచ్చు.

గమనిక: మరింత ఖచ్చితమైన సమాచారం కోసం..రైల్వేశాఖ అధికారులను లేదా.. దక్షిణ మధ్యరైల్వే అధికారిక వెబ్‌సైన్‌ను సందర్శించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..