హైదరాబాద్‌లో eRZL ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
తీవ్రమైన వేడిలో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై eRZL హైదరాబాద్‌లో హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. హైటెక్ సిటీ, గజిబౌలి వంటి ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి శాంపిలింగ్‌తో అవగాహన నిర్వహించింది. వేసవితాపం కారణంగా అధిక చెమట వల్ల కోల్పోయిన నీరు, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపాల్సిన అవసరాన్ని వివరించింది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన పొందింది.
తీవ్రమైన వేడిని ఎదుర్కోవడానికి, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే లక్ష్యంతో eRZL రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా హైదరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి.. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేడిలో పనిచేసేటప్పుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసేటప్పుడు అధికంగా చెమట పట్టడం సహజం. ఈ ప్రక్రియలో శరీరం నీటిని మాత్రమే కాకుండా, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివలన డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. ఇది రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాన్ని గురించి eRZL బృందం నగరవాసులకు అవగాహన కల్పించింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గజిబౌలి, కోకాపేట్, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాలలో eRZL క్షేత్ర స్థాయి శాంపిలింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. బిజీగా ఉండే రోడ్లు, ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలను నేరుగా కలుసుకొని, వారికి eRZL ఉత్పత్తులను అందజేశారు. అలసటతో కూడిన రోజుల్లో ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడం ఎంత అవసరమో తెలియజేశారు. eRZL చొరవకు హైదరాబాద్‌లో అద్భుతమైన స్పందన లభించింది.
