AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

మెడికల్ నుంచి ఇంజినీరింగ్ వరకు.. ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్

కిండర్‌గార్టెన్ నుంచి పీహెచ్‌డీ వరకు సమగ్ర విద్య, 1,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రత్యక్ష శిక్షణ, ఆధునిక ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులు, జాతీయ స్థాయి గుర్తింపులతో బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

మెడికల్ నుంచి ఇంజినీరింగ్ వరకు.. ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్
Why East Point Is Bengaluru
SN Pasha
|

Updated on: Jul 08, 2026 | 9:44 AM

Share

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియగా మారింది. ఈ దిశగా బెంగళూరుకు చెందిన ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సమగ్ర విద్యా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. కిండర్‌గార్టెన్ నుంచి పీహెచ్‌డీ వరకు ఒకే విద్యా వేదికపై విద్యను అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. 12కు పైగా విద్యాసంస్థలతో కూడిన ఈస్ట్ పాయింట్ గ్రూప్, విద్యార్థి-కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తూ నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణను అందిస్తోంది. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోంది.

మెడికల్ ఎడ్యూకేషన్‌‌లో మాస్టర్

మెడికల్ ఎడ్యూకేషన్‌లో ఈస్ట్ పాయింట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ, ఎంఎస్ కోర్సులు, క్లినికల్, ప్రీ-క్లినికల్, పారా-క్లినికల్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. 1,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా విద్యార్థులకు ప్రారంభం నుంచే ప్రత్యక్ష వైద్య సేవల్లో శిక్షణ లభిస్తోంది. దీంతో వారు కేవలం వైద్యులుగానే కాకుండా సమర్థవంతమైన ఆరోగ్య సేవా నిపుణులుగా ఎదిగే అవకాశాన్ని పొందుతున్నారు. నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులు అందిస్తున్నారు. అలాగే ఫార్మసీ విభాగంలో డీ.ఫార్మ్, బీ.ఫార్మ్, ఎం.ఫార్మ్, ఫార్మ్.డి కోర్సులతో పాటు ఫిజియోథెరపీలో న్యూరాలజీ, పీడియాట్రిక్స్, మస్క్యులోస్కెలిటల్ సైన్సెస్ వంటి విభాగాల్లో బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్‌లో ఆధునిక కోర్సులు

ఇంజినీరింగ్ విద్యలో కూడా ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధునిక కోర్సులను అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి విభాగాల్లో బీఈ కోర్సులతో పాటు ఎం.టెక్, పీహెచ్‌డీ అవకాశాలు కూడా కల్పిస్తోంది. పరిశోధన, ఆవిష్కరణలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఈ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉన్నత విద్యలో బీబీఏ, ఏవియేషన్ మేనేజ్‌మెంట్, బీసీఏ, బీసీఏ (ఏఐ/డీఎస్), బీకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం వంటి కోర్సులను అందిస్తూ విద్యార్థులను కార్పొరేట్ ప్రపంచానికి సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఈస్ట్ పాయింట్ స్కూల్, ప్రీ-యూనివర్సిటీ కాలేజీల ద్వారా పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందిస్తోంది.

అవార్డులు

ఈస్ట్ పాయింట్ గ్రూప్ నాణ్యమైన విద్యకు గుర్తింపుగా పలు జాతీయ స్థాయి అవార్డులు, ర్యాంకులు దక్కించుకుంది. 2023లో టైమ్స్ బిజినెస్ అవార్డ్స్‌లో ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవార్డు అందుకోగా, 2025 టైమ్స్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్‌లో దేశంలోని టాప్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 36వ స్థానం, సౌత్ ఇండియాలో 17వ స్థానం సాధించింది. అలాగే ది వీక్–హన్సా రీసెర్చ్ సర్వేలో కర్ణాటకలో 18వ ఉత్తమ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలగా, దేశవ్యాప్తంగా 78వ స్థానంలో నిలిచింది. ఔట్‌లుక్–ఐకేర్ 2025 ర్యాంకింగ్స్‌లో కూడా దేశంలోని ఉత్తమ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 36వ స్థానం దక్కించుకుంది. విద్యను ఉద్యోగాలకు మాత్రమే కాకుండా సమాజ మార్పుకు సాధనంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.

ఈస్ట్ పాయింట్ కాలేజీలు, పాఠశాలలు

  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – అకాడమీ క్యాంపస్
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్
  • ఈస్ట్ పాయింట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
  • న్యూ రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ
  • ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
  • ఈస్ట్ పాయింట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ – జ్ఞానప్రభ క్యాంపస్
  • ఈస్ట్ పాయింట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ – అకాడమీ క్యాంపస్
  • ఈస్ట్ పాయింట్ స్కూల్

మరిన్ని వివరాల కోసం

ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈస్ట్ పాయింట్ క్యాంపస్ – “జ్ఞానప్రభ” విర్గో నగర్ పోస్ట్, బిదరహళ్లి, బెంగళూరు – 560049, కర్ణాటక, ఇండియా. ఫోన్ నంబర్: +91 720422 9999 వెబ్‌సైట్: www.eastpoint.ac.in ఈమెయిల్: admissions@eastpoint.ac.in

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.