AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

Cancer Awareness: క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి

Cancer Awareness Program by MSD Pharmaceuticals: క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దీని లక్షణాల గుర్తింపు, అధునాతన చికిత్సలైన ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీలపై అవగాహన ముఖ్యం. నిపుణుల సలహాలతో సరైన సమయంలో చికిత్స పొందడం, రోగ నిర్ధారణలో సంశయాలు తొలగించుకోవడం ప్రాణాపాయాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి.

Janardhan Veluru
|

Updated on: Jul 07, 2026 | 11:52 AM

Share

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2022 ICMR అధ్యయనం ప్రకారం ప్రతి తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ.. వ్యాధి లక్షణాలు, అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా పద్ధతులపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఎంఎస్‌డీ ఫార్మాసీటికల్, టీవీ9‌తో కలిసి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వైద్య నిపుణులతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.  డా. వంశీకృష్ణ (AIG హాస్పిటల్) ప్రకారం క్యాన్సర్ లక్షణాలు అది మొదలైన ప్రదేశాన్ని బట్టి మారుతాయని వివరించారు. అసాధారణమైన శరీర మార్పులు, ఒక్కసారిగా బరువు తగ్గడం, అధిక బలహీనత, లేదా ఎక్కడైనా గడ్డలు, రక్తస్రావం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి క్యాన్సర్ కాకపోయినా.. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి దీనికి కారణాలను నిర్ధారించుకోవడం మంచిది.

డా. సాయినాథ్ (స్టార్ హాస్పిటల్), డా. మౌనిక బొప్పన (కిమ్స్ హాస్పిటల్) సాంప్రదాయ చికిత్సా పద్ధతులైన సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ గురించి వివరించారు. ట్యూమర్ రకం, స్థానం, దశ ఆధారంగా ఈ చికిత్సలు ఉపయోగించబడతాయి. కొన్ని సందర్భాలలో, ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించడానికి సర్జరీకి ముందు కీమో లేదా రేడియేషన్ అవసరం కావచ్చు. అధునాతన చికిత్సా విధానాలలో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ మన రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్ తో పోరాడేలా చేస్తుంది. ఇది కేవలం చివరి దశ క్యాన్సర్లకే కాకుండా, కొన్ని క్యాన్సర్లలో ప్రారంభ దశలలో కూడా ఉపయోగించబడుతుంది. ప్రజలు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని ఈ కార్యక్రమం నొక్కి చెప్పింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..