Sankranti Traditional Snacks: ఎల్లలు దాటిన సంక్రాంతి వంటకాలు.. దేశ, విదేశాల్లో తెలుగింటి గుమగుమలు
సంక్రాంతి అనగా గుర్తేది భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, నోరూరించే పిండి వంటలు. కానీ ప్రస్తుత బిజీ జీవితంలో సంక్రాంతి సాంప్రదాయ పిండివంటలు తయారు చేసుకోవడం కష్టమైంది. ఈ నేపథ్యంలో ఇంటి తరహా వంటకాలకు, ముఖ్యంగా క్షీరపురి చీరాల పిండివంటలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. నాణ్యత, శుచి, శుభ్రత పాటిస్తూ తయారు చేసే అరిసెలు, కజ్జికాయలు వంటివి దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొంది, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

సాంక్రాంతి అనగా గుర్తేది భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, నోరూరించే పిండి వంటలు. సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటా ఘుమఘుమలాడే సువాసనలతో పిండివంటలు వండుతుంటారు. అరిసెలు, సకినాలు, గారెలు ఇలా రకాలు ఉన్నప్పటికీ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే తినే వంటకాలు అనేకం ఉన్నాయి. జిహ్వకో రుచి అన్నట్టుగా తీపి, కారాలతో రకరకాల పిండివంటలు వండి వడ్డించడం సంక్రాంతి విశేషం. అయితే ఇప్పుటు ఈ బిజీ లైఫ్లో ఇంట్లో వంటకాలు చేసుకోవాలంటే ఎవ్వరూ ఓపట్లేదు. సిటీలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉంటున్న ఈ కాలంలో రోజువారీ వంటకాలు చేసుకోవడమే కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సాంప్రదాయ పిండివంటలు చేసేవారికి గిరాకీ పెరిగింది. ముఖ్యంగా క్షీరపురిగి పేరోందిన చీరాల పిండివంటలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి… గతంలో సంక్రాంతి అంటే 10 రోజుల ముందు నుంచే ఇంటిళ్లపాది ఒక్క చోట చేరి అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, చక్రాలు, జంతికలు, మురుగులు, చెక్కలు లాంటి పిండి వంటలు తయారు చేయడం పరిపాటి. కానీ ఇదంతా ఒకప్పటి మాట… ప్రస్తుతం ఆపరిస్థితులు ఉన్నాయా.. అంటే, చాలావరకు తగ్గిపోయాయనే చెప్పొచ్చు.. ఈ బిజీ లైఫ్‌లో సమయానికి భోజనం చేసే తీరికలేక ఉద్యోగం, వ్యాపారం అంటూ పరిగెడుతన్నారు. క్షణం తీరిక లేకుండా డబ్బు సంపాదన కోసం పరిగెత్తాల్సిన పరిస్థిలు ఉన్నాయి. ఇక సిటీల విషయంలో అయితే పిండివంటలు కాదు కదా, కనీసం రోజు వారీ వంటలు కూడా చాలావరకు మానేశారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇక సిగ్వీ, జమోటా వంటి ఆన్‌లైన్ డెలివరీ చేసే సంస్థలకు ఫుడ్ ఆర్డర్లు ఇచ్చి కడుపునింపుకోవాల్సిన పరిస్థితులు. ఓ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేసే సందర్భాలు తక్కువైపోయాయి. ఇక పండగలకు, పబ్బాలకు పిండి వంటలు తయారీ సంగతి పూర్తిగా మర్చిపోయారు.
ఇలాంటి క్షణం తీరిక లేని సమయాల నేపథ్యంలో పండుగ రోజుల్లో సంప్రదాయ వంటకాలు తయారు చేసి అందించే చిరు వ్యాపార సంస్థలకు గిరాకీ పెరిగింది. ఇంటి తరహా వంటకాలకు మార్కెట్‌లో ఆదరణ లభిస్తోంది. అందులోను సంక్రాంతి, దసరా, వినాయక చవితి వాంటి పండుగల రోజులలో మరింతగా హోమ్లీ వంటకాలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఈనేపథ్యంలో బాపట్ల జిల్లా లో క్షీరపురిగా పిలుచుకునే చీరాలలో ఇంటి తరహా వంటకాలకు పెట్టింది పేరు. అనేక మంది దీనినే ఉపాధిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి హోమ్ ఫుడ్స్‌లో తయారు చేస్తున్న లక్ష్మీ హోమ్‌ఫుడ్స్‌లోని అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, చక్కిలాలు, జంతికలు నాణ్యమైనవి తయారు చేస్తుండటంతో వీటికి మంచి పేరు ఉంది. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా మరికొన్ని దేశాలకు సరఫరా చేస్తున్నారు.

Sankranti Traditional Snacks
నాణ్యతలో ఎక్కడా రాజీ పడకపోవడం వల్ల తమ పిండి వంటలకు మంచి గిరాకీ ఉందని హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఖచ్చితంగా రోటిలో కొట్టిన బియ్యాన్నే అరిసెల తయారీకి ఉపయోగిస్తున్నారు. పాత పద్ధతులు అంటే అమ్మమ్మ కాలంనాటి రుచులు వచ్చేలా శుచి ,శుభ్రత పాటిస్తూ పిండి వంటకాలను తాయారు చేస్తున్నారు. ఇలా తయారైన క్షీరపురి చీరాల పిండివంటకాల రుచులు దేశంలోని అని రాష్ట్రాలతో పాటుగా విదేశాలకు తరలివెళుతున్నాయి.
మన బిజీ లైఫ్ లో సాంప్రదాయ వంటకాలను సొంతంగా తాయారు చేసుకోవడం మర్చిపోయి చాల మంది ఆర్డర్ లో అయినా తెప్పించుకొని సంక్రాంతి సాంప్రదాయ పిండి పంటకాలను ఆస్వాదించేస్తున్నారు… చీరాలలో తయరుచేస్తున్న పిండి వంటకాలను ప్రత్యేకంగా పండుగ రోజులను దృష్టిలో పెట్టుకుని రుచి, శుచిగా తయారు చేస్తామని, అందుకే తమ పిండి వంటలకు దేశ, విదేశాల్లో గిరాకీ బాగుంటుందని పిండి వంటల నిర్వాహకుడు పోలిశెట్టి రఘు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
