Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట హైటెన్షన్.. పోరాట కమిటీ నాయకులు అరెస్ట్.. పూర్తి వివరాలివే..

|

May 03, 2023 | 12:27 PM

Vaisakha Steel Privatization: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు విశాఖలో నిరసనకు దిగాయి. CITU ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్టాండ్‌ సెంటర్‌ ఎదుటు కార్మికులు..

Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట హైటెన్షన్.. పోరాట కమిటీ నాయకులు అరెస్ట్.. పూర్తి వివరాలివే..
Citu Protests In Vishakhapatanam
Follow us on

Vaisakha Steel Privatization: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు విశాఖలో నిరసనకు దిగాయి. CITU ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్టాండ్‌ సెంటర్‌ ఎదుటు కార్మికులు బైఠాయించారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని కార్మికులు నినాదాలు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించాలని కోరుతూ లెఫ్ట్‌ పార్టీలు గుంటూరులో నిరసన చేపట్టాయి.

ఈ క్రమంలో శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్‌ చేసేందుకు పోలీసులు వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్‌ నుంచి వెళ్తున్న బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి

బస్టాండ్‌ ముందు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కార్యకర్తలు నినదించారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని లెఫ్ట్‌ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..