Andhra: పిడుగురాళ్లలో ఉద్యోగాల ఆశచూపి కోట్ల రూపాయల వసూలు

లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ పేరుతో పిడుగురాళ్లలో విద్యార్థులను భారీగా మోసం చేశారు. బాధితుల ఆరోపణల ప్రకారం, యూరప్‌లో ఉద్యోగాలు అందిస్తామని చెప్పి, 2022-2024 మధ్యకాలంలో ఒక్కో విద్యార్థి నుంచి 30-40 లక్షల వరకు వసూలు చేశారు. మొత్తం రూ.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు భావిస్తున్నారు.

Andhra: పిడుగురాళ్లలో ఉద్యోగాల ఆశచూపి కోట్ల రూపాయల వసూలు
Victims

Updated on: May 27, 2025 | 1:50 PM

విదేశాల్లో టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల పేరిట విద్యార్థులను నిలువునా ముంచింది ఓ చీటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. పిడుగురాళ్లలో ఉద్యోగాల పేరుతో తమని మోసం చేశారని లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు.

2022 నుంచి 2024 మధ్య కాలంలో యూరప్ పంపిస్తామని ఇన్‌స్టిస్ట్యూట్ తమని మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి ముప్ఫై, నలభై లక్షలు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్‌స్టిట్యూట్ యజమాని పసుమర్తి కిషోర్, సిబ్బంది, బంధువులు తమ వద్ద సుమారు 5 కోట్లకు పైగా వసూలు చేశారని బాధిత విద్యార్థులు.

ఉద్యోగం వచ్చిందని కొందరు విద్యార్థులను ఊటీ ట్రిప్‌కి కూడా పంపింది లలిత టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌. డబ్బు తిరిగివ్వాలని అడిగితే ఇన్‌స్టిట్యూట్ యజమాని బెదిరిస్తున్నారని పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును ఆశ్రయించారు బాధితులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..