Vallabhaneni Vamsi: వంశీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది.?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వంశీ బెయిల్ పిటిషన్‌ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైలులో ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇంతకీ వంశీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది.? వంశీ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారు?.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ.. బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. అయితే వంశీ బెయిల్ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్ చేసింది.
వంశీకి స్లీప్ టెస్ట్ నిర్వహించాలన్న వైద్యులు
చాలా రోజులుగా జైలులో ఉన్న వంశీ.. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సోమవారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వంశీకి స్లీప్ టెస్ట్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. విజయవాడ జీజీహెచ్‌లో న్యూరాలజీ స్పెషలిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు GGHకి తీసుకెళ్లారు. అయితే జీజీహెచ్‌లో స్లీప్ టెస్ట్ సౌకర్యం లేకపోవడంతో.. పల్మనాలజీ వైద్యుల ఆధ్వర్యంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీకి బీపీ, షుగర్ నార్మల్‌గానే ఉన్నాయి. అతని ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకోవచ్చన్నారు.
జీజీహెచ్‌లో ఉన్న వల్లభనేని వంశీని చూడటానికి వచ్చిన ఆయన భార్యను లోనికి వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. కోర్టు అనుమతి లేకపోవడమే దీనికి కారణమంటున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




